/rtv/media/media_files/2026/03/11/kd-2026-03-11-11-09-21.jpg)
Danam Nagender and Kadiyam Srihari
Disqualification of MLAs : బీఆర్ఎస్ పార్టీ బీఫాం మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు బిగ్ రిలీఫ్ లభించింది. కాగా, వారి అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తూ స్పీకర్ ప్రసాదరావు తీర్పు వెలువరించడం సంచలనంగా మారింది. ఇద్దరి అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు.వారి అనర్హతపై బీఆర్ఎస్, బీజేపీలు వేసిన పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ కొట్టివేశారు. కాగా విచారణ సందర్బంగా తాము ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నామని కడియం, దానం స్పీకర్‌కు చెప్పినట్లు తెలిసింది. దీంతో స్పీకర్ వారికి క్లీన్ చీట్ ఇచ్చారు.
కాగా బీఆర్‌ఎస్ కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా వారిలో ఇప్పటకే 8 మందికి స్పీకర్ ఇప్పటికే క్లీన్ చీట్ ఇచ్చారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మాత్రం తీర్పు వేరుగా ఉంటుందని అంతా భావించారు. దీంతో వారిపై అనర్హత పడుతుందని అనుకున్నారు. కానీ స్పీకర్ భిన్నంగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయంశంగా మారింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఆయనకు స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడంపై బీఆర్‌ఎస్ మండి పడుతోంది. కడియం శ్రీహరి సైతం ఆయన కూతురు కావ్య కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారం చేశారు. అయినా వీరిద్దరికి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్ తప్పు పడుతోంది. కాగా ఎమ్మెల్యేల అనర్హత కేసుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుండగా ఈ రోజు స్పీకర్ వారికి క్లీన్ చీట్ ఇవ్వడం సంచలనంగా మారింది.
స్పీకర్ పరిధిలో తప్పు చేయలేదు
కాగా, స్పీకర్ తీర్పు అనంతరం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పరిధిలో తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. స్పీకర్ తనపై అనర్హత వేటు వేసినా పోరాటం ఆపనన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తున్ననని దానం అన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏ రోజు పనిచేయలేదని దానం చెప్పారు. ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే సిద్ధంగా ఉన్నానన్నారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ తనను ఏ వివరణ అడగలేదని దానం అన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా వివరణ అడగలేదన్నారు.నాకు పార్టీ ఎప్పుడూ విప్ జారీ చేయలేదన్న దానం నాపై పిటిషన్ వేసిన వాళ్లకు ఏ అధికారం ఉందని ఆయన నిలదీశారు.
Follow Us