Balapur Laddu: బాలాపూర్‌ లడ్డూ రికార్డులు బ్రేక్‌ చేయనుందా..?

గతేడాది వేలం పాటలో రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డూ రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. 1994లో తొలిసారిగా నిర్వహించిన వేలంలో ఈ లడ్డూ ధర రూ.450 పలికింది. అయితే.. ఈ సారి ఈ లడ్డూ ధర రూ.30 లక్షలు దాటుతుందని అంతా భావిస్తున్నారు.

New Update
hyd

Balapur Laddu: హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల పేరు చెబితే ముందుగా వినిపించే పేరు ఖైరతాబాద్ గణపతి ఒకటి కాగా…రెండోది బాలాపూర్‌ లడ్డూ. గతేడాది వేలం పాటలో రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డూ రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. ఈ ఏడాది ఎంత ధర పలుకుతుంది, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. భారీ అంచనాల మధ్య బాలాపూర్ గణేష్ లడ్డు వేలం ప్రారంభమైంది. గతేడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు ఈసారి మరింత పెరిగే చాన్స్ ఉంది. 30 ఏళ్లుగా సాగుతున్న ఈ లడ్డూ వేలంపై ఈ ఏడాది భారీ అంచనాలున్నాయి. లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్త నిబంధనలు పెట్టారు నిర్వాహకులు. ముందుగా 27లక్షలు కట్టిన వాళ్ళకే వేలంలో అవకాశం ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈసారి 30 లక్షలకు పైగా పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ధనవంతులు, రాజకీయ నాయకులు ఈ లడ్డూ కోసం పోటీపడుతున్నారు.

1994లో మొదలైన బాలాపూర్‌ లడ్డూ వేలంపాట తొలిసారిగా రూ.450తో ప్రారంభమైంది. 2016లో రూ.14.65 లక్షలు చేరి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయగా.. 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలు, 2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు పలికింది. అయితే 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు అయింది. బాలాపూర్‌ సర్కిల్ బొడ్రాయి వద్ద ఈ వేలం పాట జరగనుండగా.. వేలంపాట అనంతరం శోభాయాత్ర ప్రారంభం కానుంది.

Also Read: Vinayaka Sobha Yatra: గణేశ్‌ శోభాయాత్ర రూట్‌ మ్యాప్‌ ఇదే…ఫాలో అయిపోండి మరి!

Advertisment
Advertisment
తాజా కథనాలు