Heat Waves : ఉదయం 8 గంటలకే తగ్గేదేలే అంటున్న భాను బ్రదర్.. 8 జిల్లాల్లో ఉష్ణోగ్రతల కొత్త రికార్డులు! ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలోని 8 జిల్లాల్లో 45.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. By Bhavana 01 May 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Summer Effect : ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యుడు(Sun) తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అసలు కాలు బయట పెట్టాలంటనే ప్రజలు అదిరిపోయేట్లు చేస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ(Telangana) లోని 8 జిల్లాల్లో 45.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43.2 డిగ్రీలు దాటాయి. తీవ్రమైన వడగాల్పుల(Hail) ప్రభావానికి జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎండ వేడిమి తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 48 నుంచి 49 వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. గత రెండు రోజులుగా తీవ్రమైన వడగాల్పులు వీచాయి. మరో 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. పలు జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు(Yellow Alert) జారీ చేసింది. బుధ, గురువారాల్లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్ధపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబ్‌బాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మే 3వ తేదీన నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్ధపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వృద్ధులు, చిన్న పిల్లలపై ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరించారు. తలపై ఎండ తగలకుండా ఉండేందుకు గొడుగు, శరీరంలో నీటి శాతం తగ్గకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లను వెంట తీసుకోవాలని సూచిస్తున్నారు. Also read: నేడే మేడే.. ఈ కార్మికుల దినోత్సవ చరిత్ర ఇదే! #yellow-alert #heat-waves #summer #weather-report మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి