తెలంగాణ యూనివర్సిటీలో ప్రక్షాళన షురూ, కీలక అధికారులపై వేటుపడే ఛాన్స్! గత కొన్నాళ్లుగా తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారింది. వీసీ రవీందర్ గుప్తా నిర్ణయాలతో ప్రతిసారి వర్సిటీలో ఏదో ఒక వివాదం రాజుకుంటుంది. దీంతో యూనివర్సిటీలో ప్రక్షాళన ప్రక్రియ షురూ అయింది.. దీంతో ఇందులోని కీలక అధికారులపై భారీగా వేటు పడే ఛాన్సుంది. By Shareef Pasha 19 Jun 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ క్రమంలోనే.. వరుసగా ఈసీ సమావేశాలు జరిగాయి. దాంతో.. వీసీ అధికారాలకు కత్తెర వేస్తూ తీర్మానాలు చేస్తూ వచ్చింది పాలకమండలి. మొదటగా రిజిస్ట్రార్‌ను తొలగించి.. ఆ తర్వాత ఆర్థిక అంశాలకు వీసీని దూరం చేసింది. వర్సిటీని చక్కదిద్దే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ తీర్మానించింది. అంతేకాదు.. ఈసీ లేఖతో ఇటీవల విజిలెన్స్ అధికారులు వర్సిటీలో తనిఖీలు చేపట్టారు. అన్నింటిపైనా పూర్తి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు ఇచ్చారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ వలలో వీసీ రవీందర్‌గుప్తా చిక్కారు. ఏసీబీకి పట్టుబడ్డ తర్వాత అక్రమాలపై విచారణ ఏసీబీకి పట్టుబడ్డ తర్వాత టీ.యూ.లోని అక్రమాలపై విచారణ వేగవంతమవుతోంది. ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్లుగా నియమించబడ్డ ప్రొఫెసర్ విద్యావర్ధిని, కనకయ్యలను సస్పెండ్ చేయాలని వర్సిటీ పాలకమండలి తీర్మానం చేసింది. హైదరాబాద్‌లో ఈసీ సమావేశం జరగ్గా.. వీసీ రవీందర్ గుప్తాను ఏసీబీ అరెస్ట్ చేయడంతో.. విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చైర్మన్‌గా వ్యవహరించారు. వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్లు ప్రొఫెసర్ కనకయ్య, శివశంకర్, విద్యావర్ధినిపై కేసులు నమోదు.. ఏరియర్స్ పేరిట అక్రమంగా 10 లక్షలు తీసుకున్న కాంట్రాక్టు అధ్యాపకుడు శ్రీనివాస్‌ను, రాజేందర్ తీసుకున్న అడ్వాన్సుల మొత్తం వెంటనే రికవరీ.. ఇటీవల నిర్వహించిన అధ్యాపకుల క్యాస్ పదోన్నతులకు ఆమోదం.. వారికి రావాల్సిన ఏరియర్స్ చెల్లించడం.. అర్హత గల అధ్యాపకులకు రొటీన్‌గా క్యాస్ పదోన్నతులు కల్పించడం.. లాంటి కీలక అంశాలకు గ్రీన్ స్నిగ్నల్ ఇచ్చింది పాలకమండలి. దాంతో పాటుగా.. 2021 నుంచి 2023 వరకు నిర్వహించిన పీహెచ్‌డీ అడ్మిషన్లపై ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుల చేత ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేస్తోంది. ఉన్నత విద్యాశాఖ అధికారి నవీన్ మిట్టల్‌పై విమర్శలు వాస్తవానికి.. వీసీగా నియామకమైన నాటి నుంచే రవీందర్‌గుప్తా వ్యవహారం వివాదాస్పదమవుతోంది. 100కి పైగా అక్రమ ఉద్యోగాలు సృష్టించి భారీగా వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అటు.. తెలంగాణ ప్రభుత్వంతో పాటు.. ఉన్నత విద్యాశాఖ అధికారి నవీన్‌మిట్టల్‌పైనా రవీందర్‌గుప్తా విమర్శలు చేశారు. కొన్నాళ్లుగా ఆయన తీరును వ్యతిరేకిస్తూ.. సిబ్బందితో పాటు విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వీసీపై పెద్దయెత్తున అవినీతి ఆరోపణలు వ్యక్తమైనా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ.. సడెన్‌గా.. లంచం తీసుకుంటూ వీసీ రవీందర్‌గుప్తా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడటంతో వర్శిటీలో ప్రక్షాళన స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి