Telangana: పరేషాన్ చేస్తున్న ఈ-చలాన్‌.. రెండో రోజూ మొరాయించిన వెబ్‌సైట్‌..

తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఆఫర్ నేపథ్యంలో ఈ చలాన్ వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని చలాన్లు పే చేసేందుకు జనాలు భారీ సంఖ్యలో సైట్‌ను ఓపెన్ చేయడంతో అదికాస్తా క్రాష్ అయ్యింది. సైట్ ఓపెన్ అవడం లేదు.

New Update
Telangana: పరేషాన్ చేస్తున్న ఈ-చలాన్‌.. రెండో రోజూ మొరాయించిన వెబ్‌సైట్‌..

Telangana Traffic Challan: గత కొన్నేళ్లుగా పెండింగ్‌ చలాన్లను వసూళ్లు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ట్రాఫిక్‌ పోలీసులు డిస్కౌంట్లు ప్రకటించి వెసులుబాటు కల్పిస్తున్నారు. తాజాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, ట్రాఫిక్‌ పోలీసులు ఈ చలాన్లపై డిస్కౌంట్లు ప్రకటించి పెండింగ్‌ చలాన్లు చెల్లించాలని ప్రకటించారు. డిస్కౌంట్‌పై ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. ఈ-చలాన్‌ వెబ్‌సైట్‌కు ట్రాఫిక్‌ పెరిగిపోయింది. ఇంటర్నెట్‌లో ఈ-చలాన్‌ సైట్‌కు వెళ్లి క్లిక్‌ చేస్తే.. ‘Oops! Something went wrong’.. అని దర్శనమిస్తోంది. మంగళవారం నుంచి సైట్‌లో వాహనం నెంబర్‌ ఎంటర్‌ చేస్తే దానిపై ఉన్న పెండింగ్‌ చలాన్లను చూపడం లేదు. నేడు ఏకంగా అసలు సైటే పనిచేయడం లేదంటూ వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

జీవో విడుదల చేసిన సర్కార్‌..

ట్రాఫిక్‌ చలాన్లకు సంబంధించి రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు మంగళవారం జీవో విడుదల చేశారు. చలాన్స్‌‌ పెండింగ్‌‌లో ఉన్న వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే పోలీసులు ఈ–చలాన్ సైట్‌‌ను అప్‌‌డేట్ చేశారు. అయితే జీవో విడుదలైన వెంటనే ఈ చలాన్‌ సైట్‌పై వాహనదారుల తాకిడి పెరిగింది. దీంతో చలాన్‌ పోర్టల్‌ మొరాయిస్తున్నది. వాహనదారులు తమ వెహికిల్స్‌పై ఎన్ని చలాన్స్ పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకుందామనుకున్నా అవకాశం లేకుండా పోయింది. డిస్కౌంట్‌ ఆఫర్ జనవరి10వ తేదీ వరకు అమలు చేసే అవకాశం ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వాహనదారులు అంతా ఒకేసారి ఈ చలాన్‌ పోర్టల్‌ను ఓపెన్‌ చేస్తుండటంతో టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనాలపై పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసేంత వరకు ఆఫర్ కొనసాగించే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 47,25,089 ట్రాఫిక్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో అత్యధికంగా 18,33,761 హెల్మెట్‌ వాడని చలాన్స్‌ ఉన్నాయి. డిస్కౌంట్ ఆఫర్ అమల్లోకి వస్తే ఈసారి పెండిగ్ చలాన్స్ పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.

Also Read:

వైసీపీ మరో బిగ్ షాక్.. ‘గుడ్ బై’ చెప్పిన ఎమ్మెల్యే..!

ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్..

Advertisment
Advertisment
తాజా కథనాలు