డాడీ స్పూర్తి, తాత ఆశిస్సులంటూ అచ్చం తాతలాగే మాట్లాడిన హిమాన్ష్

సీఎం కెసిఆర్ మనవడు హిమాన్షు ఈ మధ్యకాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. చదువులో ముందుండడమే కాకుండా, పలు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంలను ఏర్పాటు చేస్తూ మిగతా విద్యార్థులకు భరోసాను కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే హిమాన్షు మరో ముందడుగు వేసి తన గొప్ప మనసును చాటుకుని తాతకు తగ్గ మనవడిగా ప్రశంసలను అందుకున్నాడు. అంతేకాదు నేను ఇదంతా చేయడానికి ముఖ్యకారణం.. మా తాతగారు కేసీఆర్‌ గారి ఆశిస్సులు, మా నాన్న నాకిచ్చిన ఇన్సిఫిరేషన్‌ అంటూ చెప్పుకొచ్చాడు.

New Update
డాడీ స్పూర్తి, తాత ఆశిస్సులంటూ అచ్చం తాతలాగే మాట్లాడిన హిమాన్ష్

కేటీఆర్ కొడుకు హిమాన్షు ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని సుమారు కోటి రూపాయలతో కార్పొరేట్ స్థాయిలో ఈ స్కూల్‌ని తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ఆ స్కూలుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. హిమాన్షు ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గచ్చిబౌలి కేశవనగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి నాకు మా తాతగారు ఆదర్శం అంటూ అందరిని ఆశ్చర్యపరిచాడు.

విద్యార్థుల సమస్యలు దగ్గరుండి అడిగి మరి తెలుసుకుని ఆ పాఠశాల బాగుకోసం దత్తత తీసుకున్నాడు. అనంతరం పాఠశాల అభివృద్ధి కోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేసి అత్యాధునిక హంగులతో ఆ పాఠశాల రూపురేఖలను మార్చి దానిని సుందరంగా తీర్చిదిద్దాడు. హిమాన్షు అందించిన సహకారంతో స్కూల్‌లో ఉన్నటువంటి విద్యార్థులకు మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ హాల్, ఆట స్థలం, బెంచీలు అందించామని తెలియజేశారు. దీంతో విద్యార్ధుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం ఇందులో చదువుకున్న విద్యార్థులంతా లాయర్లు గానూ, డాక్టర్లు గానూ, ఇంజనీర్లు గానూ, పొలిటీషియన్‌ గానూ అన్ని రంగాల్లో అత్యున్నత స్ధాయిలో ఉండాలని కోరుకున్నట్లు హిమాన్ష్ విద్యార్ధులనుద్ధ్యేశించి మాట్లాడారు.

అయితే తానే నేరుగా ఆ స్కూల్‌కి పోయి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. జులై 12న తేదీన ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ఆ పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం హిమాన్షు మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇది చూసిన చాలామంది ఇంత చిన్న వయసులో హిమాన్ష్ ఎంత పెద్ద మనసు చాటుకున్నాడంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం నేను ఇదంతా చేస్తున్నానంటే మా తాతగారు కేసీఆర్‌ గారి ఆశిస్సులు, మా నాన్నే నాకు ఇన్సిఫిరేషన్‌ అంటూ గర్వంగా చెప్పుకొచ్చాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు