ప్రియుడితో సన్నిహితం.. బాలికను బెదిరించి అత్యాచారం ఓ బాలిక తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్నప్పుడు తన ప్రియుడి స్నేహితులు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని చూపి బెదిరించి పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మరో ముగ్గురు స్నేహితులు ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు షీ-టీమ్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. By Shareef Pasha 27 Jun 2023 in క్రైం కరీంనగర్ New Update షేర్ చేయండి ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పసి పాప నుంచి పండు ముసలి దాకా.. కామాంధులు ఎవరినీ వదలడం లేదు. వావి వరసలు మరచి.. పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తమ కామ వాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. బ్లాక్ మెయిల్‌తో ఒకడు, బెదిరించి మరొకడు, స్నేహం పేరుతో ఇంకొకడు, ప్రేమ, పెళ్లి.. ఇలా 'అఘాయిత్యానికి పాల్పడేందుకు అడ్డదారులెన్నో' అన్నట్లుగా బంధువులు, తెలిసిన వారు, పరిచయస్థులు, స్నేహితుల ముసుగు తొడిగిన వారే ఎక్కువగా ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆడవారు అర్ధరాత్రే కాదు.. పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా భయపడేలా చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో తాజాగా.. ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది. ఆ ఫొటోలు, వీడియోలను కుటుంబసభ్యులకు చూపుతామంటూ బెదిరించి.. బాలికను లొంగదీసుకున్నారు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను తమ ఫ్రెండ్స్‌తో పంచుకున్నారు. ఆ వీడియోలను చూపి.. ఇటీవల వారి స్నేహితులు మరో ముగ్గురు బాధిత బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో 3 రోజుల కిందట బాలిక షీ-టీమ్‌ను ఆశ్రయించింది. విషయం షీ-టీమ్ దృష్టికి వెళ్లడంతో వారు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచారు. అయితే.. సోమవారం రోజున బాధిత బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జరిగిన తతంగమంతా వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాలిక ప్రియుడు సహా ఆరుగురిపై అత్యాచారం, బెదిరింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో ఒకరు మేజర్ కాగా.. ఐదుగురు మైనర్లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఐదుగురు ఇంటర్ చదువుతుండగా.. మేజర్ అయిన వ్యక్తి పాలిటెక్నిక్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి