Telangana: అభయహస్తం అప్లికేషన్‌పై అనేక సందేహాలు.. సమాధానం ఏది?! తెలంగాణ అభయహస్తం అప్లికేషన్స్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు ఫామ్‌లో బ్యాంకు వివరాలు లేకుండా పెన్షన్లు, రైతు భరోసా, ఆర్థిక సాయం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు అర్హతలు ఎలా నిర్ధారిస్తారనేది ప్రశ్నగా మారింది. By Shiva.K 29 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Prajapalana Abhayahastham Application: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అభయ హస్తం పథకాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో తమ దరఖాస్తులను సమర్పిస్తున్నారు. వార్డు, గ్రామ, మండల ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన దరఖాస్తులను తీసుకుని, అప్లై చేస్తున్నారు ప్రజలు. అయితే, ఈ ప్రజాపాలన దరఖాస్తులపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తులో ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ బుక్ వివరాలను కోరిన ప్రభుత్వం.. బ్యాంకు వివరాలను మాత్రం అడగలేదు. దాంతో బ్యాంకు వివరాలు లేకుండా.. పెన్షన్లు, రైతు భరోసా, ఆర్థిక సాయం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు జనాలు. అంతేకాదు.. రైతు భరోసా మళ్లీ అప్లై చేసుకోవాలనడం, అందుకు రేషన్ కార్డు కోరడంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగానే ప్రజలు ఒకే కుటుంబంలో పలువురి పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఇలా.. ఒకే కుటుంబంలో వేర్వేరు వ్యక్తుల పేరు మీద భూమి ఉంటే.. అందరూ అప్లై చేయాలా? లేక ఒకే ఫామ్‌లో చేసుకోవచ్చా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఇక వ్యవసాయ కూలీగా ఉండి ఉపాధి హామీ కార్డు లేకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు జనాలు. ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌పైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమకారుల విషయంలోనూ ఇదే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎఫ్ఐఆర్ లేకపోతే ఉద్యమకారులు కానట్లేనా? అని ప్రశ్నిస్తున్నారు. Also Read: కాళేశ్వరంలో భారీ అవినీతి.. మంత్రుల సంచలన ఆరోపణలు.. సూర్యుడి రథంలో 7 గుర్రాలే ఎందుకుంటాయి? ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..! #telangana-government #prajapalana-abhayahastham-application #telangana-govt-scheme మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి