సిద్ధిపేట జిల్లాలో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సుడిగాలి పర్యటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సిద్ధిపేట జిల్లా శ్రీ కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి దేవాలయ క్యూ-లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. పూర్ణకుంభంతో మంత్రికి ఘనస్వాగతం పలికిన కొమురవెల్లి ఆలయ అర్చకులు. అనంతరం 12 కోట్ల వ్యయంతో క్యూలైన్ల కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అంతకుముందు స్థానిక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి పట్నం వేసి కల్యాణోత్సవంలో హాజరై అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో మంత్రి పాల్గొన్నారు. By Shareef Pasha 05 Jul 2023 in రాజకీయాలు Scrolling New Update షేర్ చేయండి సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లిఖార్జున స్వామివారిని బుధవారం రోజున మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. తనతో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. అంతేకాకుండా ఆలయంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు. ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దాంతో పాటుగా జిల్లాలోని పలు ప్రదేశాలను సందర్శించారు. అనంతరం 12 కోట్ల వ్యయంతో క్యూలైన్ల కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తన సొంత ఇలాఖా అయినటువంటి సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు సుడిగాలి పర్యటన చేయటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేశారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యం పరంగా, దేవాలయాల అభివృద్ధి పరంగా అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నివిధాల అభివృద్ది పనులను చేపడుతున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. కొమురవెళ్లి మల్లన్న దివ్య క్షేత్రంలో రూ.12 కోట్ల వ్యయంతో క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొమురవెళ్లి మల్లన్న దేవాలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. కొమురవెల్లి మల్లన్నకు ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాలయాభివృద్ధి భూమి పూజ చేసి, పట్టుదలతో తెలంగాణ సాధించి వచ్చి ఇతోధికంగా ఆలయ అభివృద్ధికై సంకల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు ఉండేవి కావు. దేవాలయ అభివృద్ధికై రూ.36 కోట్లు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టినట్లు వెల్లడించారు. మల్లన్న కల్యాణోత్సవంలో ఇచ్చిన హామీ మేరకు మల్లన్నకు బంగారు కిరీటం, వెండి తలుపులు, వెండి ముఖద్వారాలు చేయించినట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అతిపెద్ద మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభించి, ఆ గోదావరి జలాలు తెచ్చి మల్లన్నకు కాళ్లు కడిగి సీఎం కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి