Telangana: తాగి బయటకొచ్చారో తాట తీసుడే.. పోలీసుల మాస్ వార్నింగ్..

న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై నజర్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. ఎవరైనా తాగి డ్రైవింగ్ చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు సైబరాబాద్ సీపీ అవినాష్. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

New Update
Telangana: తాగి బయటకొచ్చారో తాట తీసుడే.. పోలీసుల మాస్ వార్నింగ్..

Telangana CP Mahanti: 'ఒక్కొక్కడు కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపించు'.. అనే డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఇదే డైలాగ్‌తో మందు బాబులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మత్తులో ఒక్కడు చిక్కినా తాట తీసుడే అని హెచ్చరిస్తున్నారు. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. దొరికారో కోడిని కమ్మినట్లు కమ్మేసుడే అంటున్నారు తెలంగాణ కాప్స్. తెలంగాణలో కొత్త ప్రభుత్వం డ్రగ్స్‌ మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ విషయంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది ప్రభుత్వం. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తండా డేగ కన్నుతో వేట సాగిస్తున్నారు. డ్రగ్స్ అనే పదం వినిపిస్తే చాలు.. వేటాడి వెంటాడి పట్టేస్తున్నారు.

ఇక న్యూఇయర్ వేడకల నేపథ్యంలో మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఖాకీలు. న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే అన్ని ఈవెంట్లకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎవరైనా అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి. ఆటోలు, క్యాబ్‌ల నిర్వాహకులకూ వార్నింగ్ ఇచ్చారు సీపీ. తాగి డ్రైవింగ్ చేయొద్దన్నారు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఇక రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి, ఫ్లై ఓవర్లు, ఓఆర్‌ఆర్‌ మూసివేయడం జరుగుతుందన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలు, గూడ్స్ వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. డిసెంబర్‌ 31ని జీరో యాక్సిడెంట్‌గా చేయాలన్నదే తమ లక్ష్యంగా పేర్కొన్నారు సీపీ అవినాష్. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీపీ.

Also Read:

అయోధ్య రైల్వే స్టేషన్‌కు 5 ప్రత్యేకతలు.. అవేంటంటే..

ఇక నుంచి డ్రగ్ అండ్ డ్రైవ్.. దొరికారో బతుకు బస్టాండే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు