Telangana: ఇక నుంచి డ్రగ్ అండ్ డ్రైవ్.. దొరికారో బతుకు బస్టాండే..!

న్యూఇయర్ వేళ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగానే.. డ్రగ్ అండ్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ టెస్టుల్లో దొరికితే.. నేరుగా జైల్లో తోసేయనున్నారు పోలీసులు.

New Update
Telangana: ఇక నుంచి డ్రగ్ అండ్ డ్రైవ్.. దొరికారో బతుకు బస్టాండే..!

Telangana: న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసులు సరికొత్త స్టెప్ తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోని డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్‌ను(Drug Detection Kits) రంగంలోకి దించింది నార్కోటిక్ టీం. రేపటి నుంచి పరీక్షలు చేయడానికి నార్కోటిక్ బ్యూరో(Telangana Anti Narcotics Bureau) సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు చేరాయి. లాలాజలంతో పాటు అవసరమైతే మూత్ర పరీక్షలను అధికారులు చేయనున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ రాగానే అప్పటికప్పుడే డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్ రిపోర్టు రాగానే మరిన్ని పరీక్షల కోసం మూత్ర పరీక్షలను అధికారులు చేయనున్నారు.

రెండింటిలోనూ పాజిటివ్ రిపోర్టు వస్తే సదరు వ్యక్తిని అధికారులు అదుపు తీసుకోనున్నారు. డ్రగ్స్ తీసుకున్న మూడు రోజుల తర్వాత కూడా రక్త, మూత్ర పరీక్షల్లో వ్యవహారం బయటపడనుంది. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే లక్ష్యం అని నార్కోటిక్ బ్యూరో అంటోంది. ఒక్కో కమిషనరేట్‌కు 25 చొప్పున డ్రగ్ డిటెక్షన్ పరికరాలు అందించనున్నారు. ట్రై కమిషనరేట్ పరిధిలో జంక్షన్ల వద్ద డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. డ్రగ్ డిటెక్షన్ పరీక్షలపై పోలీసులకు ఇప్పటికే శిక్షణ పూర్తి అయింది. ఇక పరీక్షలను ముమ్మరంగా నిర్వహించనున్నారు.

Also Read:

జగత్జంత్రీలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే చోరీ చేశారు..!

తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారందరికీ రూ. 5 లక్షల బీమా..

Advertisment
Advertisment
తాజా కథనాలు