Telangana: సర్పంచ్‌ ఎన్నికలకు మొదలైన కసరత్తు.. ఓటర్ల జాబితా తయారీపై..

తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. పంచాయతీల్లో వార్డు మ్యాపింగ్‌, వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీపై ఫోకస్‌ పెట్టారు. అసెంబ్లీ ఓటర్ల జాబితా నుంచి పంచాయతీ ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు.

New Update
Telangana: సర్పంచ్‌ ఎన్నికలకు మొదలైన కసరత్తు.. ఓటర్ల జాబితా తయారీపై..

Telangana : తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లు మొదలుపెట్టింది. పంచాయతీల్లో వార్డు మ్యాపింగ్‌, వార్డుల వారీగా ఓటర్ల  జాబితా తయారీపై ఫోకస్‌ పెట్టారు. వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీపై డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రతి జిల్లా నుంచి ఐదుగురు ఆపరేటర్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్‌ 3 నుంచి MCHRDలో ఆపరేటర్లకు ట్రైనింగ్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఓటర్ల జాబితా నుంచి పంచాయతీ ఓటర్ల జాబితా తయారీ చేస్తున్నారు. గ్రామపంచాయతీల్లో ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది.

Also Read : కొత్త ఇళ్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఫోకస్‌.. రూ.4 లక్షలకే..

Advertisment
Advertisment
తాజా కథనాలు