మరోసారి ఫ్లెక్సీల రగడ, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్లెక్సీలు!

నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల రగడ మొదలైంది. ఎమ్యెల్యే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఉద్ద్యేశించి జిల్లావ్యాప్తంగా ప్లెక్సీలు వెలిశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా తీవ్రదుమారం రేపుతున్నాయి. అసలెవరు ఈ ప్లెక్సీలను ఏర్పాటు చేశారనేదే ప్రస్తుతం జిల్లాలో హాట్‌ టాఫిక్‌గా మారింది..

New Update
మరోసారి ఫ్లెక్సీల రగడ, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్లెక్సీలు!

telangana-nzb-mla-jeevanreddy-flexy-viral-comments-schemes-politics-brs-talveda

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం, తల్వేద గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరోసారి ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంతేకాదు.. తనని ఉద్ధ్యేశించి అయ్యా! MLA జీవన్ రెడ్డి మీరు మాకిచ్చిన హామీలన్ని ఎక్కడంటూ రాసుకొచ్చారు. అభివృద్ది పేరుతో ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారని ప్లెక్సీలపై పెద్దపెద్ద అక్షరాలతో రాసుకొచ్చారు. గతంలోనూ తన పేరుతో ప్లెక్సీలు వెలిశాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఇదే హాట్ టాఫిక్‌గా మారింది. అంతేకాదు ఈ ప్లెక్సీలు నెట్టింట్లో వైరల్‌ అవుతూ రచ్చ చేస్తున్నాయి. ఇలా డైరెక్ట్‌గా ప్లెక్సీలపై ఎమ్మెల్యే పలు చర్చలకు దారితీస్తోంది. దీనిపై ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే... ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం పట్ల పట్టణ బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. వామపక్ష నాయకులు ప్రజలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్లెక్సీపై ఎమ్మెల్యేను ఉద్ద్యేశించి ఇలా వరుసగా రాసుకొచ్చారు...

1. రైతులకు రుణ మాఫి ఎక్కడకు పొయే ?

2. మా ఊరిలో దళితులు లేరా దళిత బందు ఎక్కడా ???

3.BCలు కొన్ని కుటుంబాలేనా ??? BC బందు అందరికి ఎప్పుడు???

4. పేద కుటుంబాలకు నీవు ఇచ్చిన డబుల్ బెడ్రుం ఇండ్లు ప్రొసిడింగ్స్ యాడికి పోయే???

5. మన ఊరు మన బడి అంటివి.

6.పేద పిల్లల ఉసురు పోసుకుంటివి??? 6 కొత్త బీ.డి పించన్లు యడికి పొయే ????

7. 'కొత్త రేషన్ కార్డులు, కోత్త పేర్ల నమోదు ప్రక్రియ యడికి పాయే ???

8. ప్రజలు ప్రశ్నించడం మెదలు పెడితేనే నాయకులు ఇష్టం వచ్చిన వాగ్దానలు చేయరు. ప్రజలను మోసం చేయరు.

Advertisment
Advertisment
తాజా కథనాలు