Telangana Ministers: సామాజికవర్గాల వారీగా మంత్రి పదువుల కేటాయింపు ఇలా ఉంది..!

కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటైంది. కేబినెట్‌లో ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, బీసీలు ఇద్దరు, ఓసీలు ఆరుగురు ఉన్నారు.

New Update
Telangana Ministers: సామాజికవర్గాల వారీగా మంత్రి పదువుల కేటాయింపు ఇలా ఉంది..!

Telangana Government: తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటుగా.. 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవి కేటాయించారు. దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

సామాజికవర్గాల వారీగా చూసుకుంటే..

కేబినెట్‌లో ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, బీసీలు ఇద్దరు, ఓసీలు ఆరుగురు ఉన్నారు. వీరిలో రెడ్డి సామాజికవర్గానికి 3 మంత్రి పదవులు, ఎస్సీ సామాజికవర్గానికి 2 మంత్రి పదవులు, బీసీ సామాజికవర్గానికి 2 మంత్రి పదవులు, ఎస్టీ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవి, వెలమ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవి, కమ్మ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవి, బ్రాహ్మణ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవి కేటాయించడం జరిగింది.

మంత్రులు వారి సామాజిక వర్గం..

భట్టి విక్రమార్క- ఎస్సీ (మాల)
దామోదర రాజనర్సింహ- ఎస్సీ (మాదిగ)
సీతక్క- ఎస్టీ సామాజికవర్గం(కోయ)
పొన్నం ప్రభాకర్- బీసీ సామాజికవర్గం(గౌడ్)
కొండా సురేఖ- బీసీ సామాజికవర్గం(పద్మశాలి)
ఉత్తమ్ కుమార్- రెడ్డి సామాజికవర్గం
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి- OC (రెడ్డి)
పొంగులేటి శ్రీనివాస్‌- OC (రెడ్డి)
జూపల్లి కృష్ణారావు- OC (వెలమ)
తుమ్మల నాగేశ్వరరావు - OC (కమ్మ)
శ్రీధర్ బాబు- OC (బ్రాహ్మణ)

ఉమ్మడి జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కాయంటే..

కరీంనగర్ - 2
ఖమ్మం - 3
నల్లగొండ - 2
మహబూబ్‌నగర్ - 2 (సీఎం+మంత్రి)
వరంగల్ - 2
మెదక్ - 1

Also Read:

తెలంగాణకు వర్షసూచన..నేడు కూడా వానలు కురిసే ఛాన్స్!

రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం..

Advertisment
Advertisment
తాజా కథనాలు