Minister Seethakka: అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యత లేని గుడ్లు.. మంత్రి సీతక్క సీరియస్!

అంగన్వాడీ కేంద్రాల్లో నాసిరకం వస్తువుల సరఫరా జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు.

New Update
Minister Seethakka: అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యత లేని గుడ్లు.. మంత్రి సీతక్క సీరియస్!

కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యత లేని గుడ్లు పంపిణీ కావడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సీరియస్ అయ్యారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాసిరకం వస్తువుల సరఫరా అంటూ వస్తున్న వార్తలపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అంగన్వాడి సెంటర్లకు కాంట్రాక్టర్లు నాసిరకం వస్తువులు సరఫరా చేస్తే, వాటిని అంగన్వాడీ కేంద్రాలు తిరస్కరించి ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు.

publive-image

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పై మంత్రి సీతక్క ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సెర్ప్ ద్వారా ప్రస్తుతం అమలవుతున్న పథకాల తీరు, బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలా కాకుండా, తమ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ కోసం అవసరం అయిన నిధులను కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు మంత్రి. కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది బడ్జెట్ లో మహిళా శక్తికి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు