Khammam-Warangal: ఆ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చండి.. మంత్రి పొంగులేటి విజ్ఞప్తి

తన నియోజకవర్గం పాలేరులోని నాలుగు మండల మీదుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న రైల్వే లైన్ అలైన్ మెంట్ ను మార్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు. ఈ మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రైతులు సాగు భూములను కోల్పోవాల్సి వస్తుందని వివరించారు.

New Update
Khammam-Warangal: ఆ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చండి.. మంత్రి పొంగులేటి విజ్ఞప్తి

ఖమ్మం, వరంగల్ జిల్లాల మీదుగా కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లోని అలైన్ మెంట్ లో మార్పులు చేయాలని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం రైల్ నిలయంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో పొంగులేటి సమావేశం అయ్యారు. డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయక్ గూడెం మీదుగా సూర్యపేట జిల్లా మోతే నుంచి గద్వాల్ వరకు ప్రతిపాదించిన నూతన రైల్వే మార్గంపై చర్చించారు. తన నియోజకవర్గం పాలేరులోని నాలుగు మండల మీదుగా ఈ రైల్వే మార్గం వెళ్తుందని వివరించారు. దీనివల్ల రైతులు సాగు భూమలను రైతులు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు.

ఇందుకు ప్రత్యామ్నాయంగా అలైన్ మెంట్ లో మార్పుచేసి మరో మార్గంలో రైల్వేలైన్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటి (KUDA) మాస్టర్ ప్లాన్ ను పరిగణలోకి తీసుకొని వరంగల్ నగర బైపాస్ రైల్వే లైన్ ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2050 కి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నామన్నారు.

ఈ నేపథ్యంలో రైల్వే శాఖ నష్కల్ నుండి హసన్ పర్తి, నష్కల్ నుండి చింతలపల్లి వరకు కొత్తగా నిర్మించతల పెట్టిన రైల్వే మార్గాన్ని వరంగల్ మాస్టర్ ప్లాన్ కు అనుసంధానం చేయాలని కోరారు. ప్రస్తుతం సిద్ధం చేసిన రైల్వే మార్గం వల్ల వరంగల్ మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అలైన్ మెంట్ మార్చాలని జీఎంకు విజ్ఞప్తి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు