Telangana: ముందు తెలంగాణలో అమలు చేసి చెప్పండి.. కాంగ్రెస్ నేతలపై మంత్రి మహేందర్ సెటైర్లు..

'మీకు మాటలు కావాలా? చేతలు కావాలా? మాటలు చెప్పి పోయే వారి మాటలు నమ్మకండి. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు అవుతున్నాయా? ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ దూతలు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ముందు కర్ణాటకలో ఇచ్చి తెలంగాణలో ఇవ్వాలి'

New Update
Telangana: ముందు తెలంగాణలో అమలు చేసి చెప్పండి.. కాంగ్రెస్ నేతలపై మంత్రి మహేందర్ సెటైర్లు..

Minister Mahender Reddy: కాంగ్రెస్ నేతలు కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన పథకాలను అమలు చేసిన తరువాత.. తెలంగాణ(Telangana)లో హామీల గురించి మాట్లాడాలని రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి(Minister Mahender Reddy) అన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని అన్నారు. గురువారం నాడు కొడంగల్(Kodangal) నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలో గోఖఫసల్వాద కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మహేందర్ రెడ్డి.. 'మీకు మాటలు కావాలా? చేతలు కావాలా? మాటలు చెప్పి పోయే వారి మాటలు నమ్మకండి. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు అవుతున్నాయా? ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ దూతలు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ముందు కర్ణాటకలో ఇచ్చి తెలంగాణలో ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు.

కొడంగల్ అభివృద్ధికి నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వందల కోట్లు తీసుకువచ్చి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలో రైతుబంధు లేదు, 24 గంటల కరెంటు లేదు, బీసీ దళిత బంధు లేవు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు కర్ణాటకలో తెలంగాణ పథకాలను ఇచ్చి.. అప్పుడు మాట్లాడితే బాగుంటుందన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని అన్నారు మంత్రి మహేందర్ రెడ్డి.

ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కామెంట్స్..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కూడా ప్రసంగించారు. రేవంత్ రెడ్డి టీవీలో మాటలు తప్ప చేతలు ఉండవన్నారు. నేను అభివృద్ధి చేశానంటున్న రేవంత్ రెడ్డి.. ఏం చేశారో చూపించాలని సవాల్ విసిరారు నరేందర్ రెడ్డి. అభివృద్ధిపై కొడంగల్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గున్నాథ్ రెడ్డిని 100 మీటర్ల గోతిలో పాతిపెడతానన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆయన ఇంటికే ఎందుకు పోయారో చెప్పాలన్నారు. ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి.. గురునాథ్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తానన్న రేవంత్ రెడ్డి.. మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే నరేందర్. సీఎం కేసీఆర్ చలవతో గత నాలుగున్నర ఏళ్లలో 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే నరేందర్.

కొడంగల్ నియోజకవర్గంలోని తాండాల అభివృద్ధికి సుమారు రూ. 100 కోట్లను నిధులు అందించామని వివరించారు. మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా? 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలో? ప్రజలు ఆలోచించాలన్నారు. '24 గంటలు మీ చుట్టూ ఉండే నేను కావాలా? పదేళ్లలో పది సార్లు కూడా నియోజకవర్గం ముఖం చూడని రేవంత్ కావాలా? ప్రజలు ఆలోచించాలి' అని నరేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తుంటే ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే నరేందర్.

Also Read:

Telangana Elections: ఇక నుంచి నా ఫోకస్ ఆ సీట్‌పైనే.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..

Advertisment
Advertisment
తాజా కథనాలు