ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్ మోదీ 9 ఏళ్ల పాలనలో యువత కోసం చేసిన ఒక్క మంచిపనైనా ప్రజలకు చెప్పి ఉంటే బాగుండేదని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాని చేసిన విమర్శలపై దీటుగా స్పందించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల 45 ఏళ్ల కల. గుజరాత్‌కు ప్రధాని రూ.20వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీని ఇచ్చారు. ఇక్కడ రూ.520 కోట్లతో రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. By Shareef Pasha 08 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి దేశ చరిత్రలోకే అత్యధిక నిరుద్యోగం సృష్టించి విఫలం అయిన ప్రధాని మోదీగా చరిత్రలో నిలుస్తారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం పరిధిలో 16 లక్షల ఖాళీలను మోదీ భర్తీ చేయలేదని, తెలంగాణలో 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నింపిన తమపై విమర్శలు చేస్తున్నారని అది మోదీకి తగదని అన్నారు. బిల్లులను ఆమోదించకుండా తెలంగాణ వర్సిటీల్లో ఖాళీల భర్తీని గవర్నర్ ఆపుతున్నారని, బిల్లులను అడ్డుకుంటున్న గవర్నర్‌కు ప్రధాని మోదీ ఒక మాట చెబితే బాగుండేదన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని అడ్డుకొని, అడవి బిడ్డల గురించి మాట్లాడటం ప్రధాని కపట ప్రేమకు నిదర్శనమన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ ఊసెక్కడా..? 15 వేల మంది స్థానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా ప్రధాని మాట్లాడలేదని దుయ్యబట్టారు. నల్ల చట్టాలతో 700 మంది రైతులను పొట్టనబెట్టుకున్న ప్రధాని వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా టూర్‌కి వచ్చినట్లు వచ్చిపోతే ఏం లాభమని విమర్శించారు. అసలు విషయాన్ని తుంగలో తొక్కి డైవర్ట్ చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మోదీ హెచ్చరికలకు మేం భయపడం తెలంగాణ మా కుటుంబం.. రాష్ట్ర ప్రజలు మా కుటుంబ సభ్యులు. వారి అభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ మాది అని అన్నారు. కేంద్ర ఏజెన్సీల బూచి చూపించి ప్రధాని చేసిన హెచ్చరికలకు మేం భయపడబోమని స్పష్టం చేశారు. తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం, అసత్యాలు మాట్లాడటం మోదీకి అలవాటుగా మారిందని మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై మండిపడ్డారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి