కేసీఆర్ కు మంత్రి జూపల్లి కౌంటర్ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఎక్కువ ఆదాయాన్ని చూపి ప్రజలను మోసం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. అది గ్యాస్.. ట్రాష్ కాదా? అంటూ కేసీఆర్ సర్కార్ కు కౌంటర్ ఇచ్చారు. ఇన్ని రోజులు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు. By Nikhil 26 Jul 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి నిన్న అసెంబ్లీలో రేవంత్ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్ అన్న కేసీఆర్ విమర్శలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. 2023 లో రెండు లక్షల తొంభై వేల కోట్లు ఖర్చుచేసినట్లు కేసీఆర్ ప్రజలకు చూపించారన్నారు. ఆదాయాన్ని ఎక్కువగా చూపించి ప్రజలను మోసం చేసినప్పుడు.. అది గ్యాస్, ట్రాష్ కాదా? అని ప్రశ్చించారు. తెలంగాణ బడ్జెట్లో 25 శాతం వ్యవసాయానికి ఖర్చుపెడితే.. 15 శాతం గత ప్రభుత్వం అప్పులు తీర్చడంలోనే సరిపోతుందన్నారు. కేసీఆర్ అమల్లోకి తెచ్చిన రైతు బంధును రైతు భరోసా గా మార్చి కొనసాగిస్తున్నామన్నారు. రైతు పండించిన ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ ఇచ్చామన్నారు. 7 నెలలకే తమ ప్రభుత్వం రూ.30,000 కోట్ల అప్పు తెచ్చిందని కేసీఆర్ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. మేం తెచ్చిన అప్పు బీఆర్ఎస్ చేసిన అప్పులు తీర్చడానికే సరిపోతోందన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ ఇన్నిరోజులు ఎందుకు రాలేదు? అంత గర్వమా? అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డిది చిన్న వయసు కాబట్టి ఆయన ముందు అసెంబ్లీ లో కూర్చోవడానికి కేసీఆర్ కి చిన్న చూపా? అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలైన 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కొటిగా అమలు చేస్తున్నప్పటికీ కేసీఆర్ తమపై తప్పడు విమర్శలు చేస్తున్నారన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి