Telangana Liberation day: రజాకార్లపై పోరాటానికి ముందు పాక్ ప్రధానికి నెహ్రు టెలిగ్రామ్.. నిజాం పీడ వదిలిన రోజు! హైదరాబాద్ నిజాంను గద్దె దింపిన రోజు రానే వచ్చింది. మన సంస్థానాన్ని భారత భూభాగంలోకి తీసుకురావడానికి ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ జరిగి సెప్టెంబర్ 17, 2023నాటికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. 'ఆపరేషన్ పోలో', 'ఆపరేషన్ క్యాటర్ పిల్లర్'తో నిజాంని భారత్ సైన్యం తరిమికొట్టింది. నాటి ప్రధాని నెహ్రూ, అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో రజాకార్లపై మొదలైన యుద్ధం ఐదు రోజుల్లోనే ముగిసింది. ఈ సైనిక చర్యకు ముందు నెహ్రూ పాక్ ప్రధానికి టెలిగ్రామ్ మెసేజ్ పంపారు. By Trinath 16 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి 'కలపండోయ్ భుజం భుజం – కదలండోయ్ గజం గజం అడుగడుగున యెడదనెత్తు – మడుగులుగా విడవండోయ్' దాశరథి కృష్ణమాచార్యులు నుంచి జాలువారిన ఇలాంటి ఎన్నో కవిత్వాలు.. నిజాం, దొరల అరాచకాలపై తన కలంతో గళం విప్పిన షోయబుల్లా ఖాన్ లాంటి పాత్రికేయులు.. తమ ప్రాణాలనే పణంగా పెట్టి తమ జీవితాలను ప్రజలకు ధారపోసిన నాటి కమ్యూనిస్టుల పోరాటాలు.. మతోన్మాద శక్తులకు కొమ్ముగాసిన హైదరాబాద్ నిజాంపై నాటి ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యల ఫలితామే ఈనాడు తెలంగాణ అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు. హైదరాబాద్‌కి నిజం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17 డేట్‌ని ఏ పేరు పెట్టి జరుపుకోవాలన్నదాంట్లో ఏ రాజకీయ పార్టీ ప్రాపగాండా వారిదే ఐనప్పటికీ ఇక్కడి ప్రజలు మాత్రం అంతా ఒకే తాటిపై ఉంటారు. బానిస సంకేళ్లను తెంపిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తారు. ఐక్యం అంటే ఏమిటో, పోరాటం అంటే ఏంటో అనేక సందర్భాల్లో యావత్ దేశానికే చూపిన గడ్డ తెలంగాణ. సెప్టెంబర్ 17న నిజాం పీడ వదిలిన రోజు.. ఇంతకి 1948లో సెప్టెంబర్ 11-17 మధ్య ఏం జరిగింది..? నాటి ప్రధాని నెహ్రూ ఏం చేశారు? నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పద్యాన్ని అస్త్రంగా ప్రయోగించిన దాశరథి కృష్ణమాచార్యులు పాకిస్థాన్‌కి టెలిగ్రామ్ సందేశం: సెప్టెంబర్ 11 , 1948న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ(Nehru) పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్(Liaqat ali khan)కు అత్యవసర టెలిగ్రామ్ సందేశం పంపారు. హైదరాబాద్‌పై తమకు ఎలాంటి దుందుడుకు ఆలోచనలు లేవని, రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు తాము తీసుకోవలసిన చర్యలు తీసుకుంటామని చెప్పారు నెహ్రూ. గతేడాది కాలంగా(అంటే ఆగస్టు 15, 1947 నుంచి సెప్టెంబర్ 11, 1948వరకు) పరిష్కారానికి తాము చేసిన అనేక ప్రతిపాదనలకు హైదరాబాద్ ప్రభుత్వం సంతృప్తికరంగా స్పందించకపోవడం లేదని.. ఇక మేం చేయాల్సింది చేస్తామని తెలిపారు. దేశంలో మతకల్లోలాలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని, మైనారిటీల ప్రాణాలను, ఆస్తులను, గౌరవాన్ని తమ శక్తి మేరకు కాపాడాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు లియాఖత్‌కి మెసేజ్ చేశారు. రజాకార్ల అరాచకాల వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని.. పాకిస్థాన్‌లో మతసామరస్యాన్ని నెలకొల్పేందుకు మీరు అన్ని చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు నెహ్రూ. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ టెలిగ్రామ్ మెసేజ్ దేనికి? 1947, ఆగస్టు 15న భారత్‌కు బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం సిద్ధించింది. అయితే అప్పటికీ భారత్‌లోని కొన్ని భూభాగాలు రాజుల నియంత్రణలో ఉన్నాయి. అందులో నాటి భారత్ ప్రభుత్వాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన వాటిలో జమ్ముకశ్మీర్‌తో పాటు హైదరాబాద్ రీజియన్ కూడా ఉంది. బ్రిటీష్ పాలకుల సాయంతో నిజాం ఇక్కడ ఆడిందే ఆట.. పాడిందే పాటగా పరిపాలించాడు. మైనార్టిలను బానిసలగా చూశాడు. లెక్కలేనంతా సంపదను కూడగట్టుకున్నాడు. నాటి నిజాం పాలను వ్యతిరేకంగా ఎంతోమంది పోరాడి అమరులయ్యారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాటి నెహ్రూ సర్కార్ నిజాంపై ప్రత్యేకంగా ఫొకస్ చేసింది. ప్రజలను విముక్తి చేసేందుకు పూర్తి ప్లాన్‌తో బరిలోకి దిగింది. నిజాంపై భారత్ సైనిక చర్యకు ముందుగా పాక్ ప్రధానికి నెహ్రూ టెలిగ్రామ్ చేశారు. మరో రెండు రోజుల్లో దండెత్తపోతున్నామని చెప్పడానికే ఈ మెసేజ్. నెహ్రూ టెలిగ్రామ్ సందేశం తర్వాత రెండు రోజులకు అంటే సెప్టెంబర్ 13న నిజాంపై ఇండియన్ ఆర్మీ ప్రత్యేక్ష యుద్ధానికి దిగింది. నిజాం పాలనలో హైదరాబాద్ రీజియన్ ఆపరేషన్ పోలో: హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హిందూ పౌరులపై అతని ప్రైవేట్ మిలీషియా (రజాకార్ల) దౌర్జన్యాలు పెరిగిపోయిన కాలంలో నెహ్రూ ఆపరేషన్ పోలో(Operation polo) ప్లాన్ వేశారు. రజాకార్ల మిలీషియాను మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధ్యక్షుడు ఖాసిం రజ్వీ సృష్టించారు. నిజాం సంస్థానంలో 90శాతం మంది హిందువులేనని టైమ్ మ్యాగజైన్(Time Magazine) తన ఫిబ్రవరి 1937 సంచికలో పేర్కొంది. బ్రిటానికా(Britannica) ప్రకారం.. నిజాం(Nizam) హైదరాబాద్ భూస్వామ్య స్వభావాన్ని కలిగిన వాడు. దోపిడిదారుడు. హిందూ మెజారిటీ జనాభా స్వరం వినిపించకుండా జాగ్రత్త పడినవాడు. రజాకార్లపై యుద్ధానికి వ్యూహాన్ని రచించిన నాటి ప్రధాని నెహ్రూ, హోంమంత్రి సర్ధార్ పటేల్ (Image credit/ThePrint) 'ఆపరేషన్ పోలో' ప్రారంభించిన సమయంలో మేజర్ జనరల్ ఎస్ఏ ఎల్ ఎడ్రూస్ నేతృత్వంలోని నిజాం దళాల సంఖ్య సుమారు 24,000 ఉంటుందని అంచనా. వీరిలో 6,000 మంది యుద్ధంలో శిక్షణ పొందిన సాధారణ సైనికులు. ప్రధానంగా హిందూ జనాభాపై రజాకార్ల క్రూరమైన చర్యలు, రాష్ట్ర సరిహద్దుల వెంబడి శత్రు సీమాంతర దాడులు, పాకిస్థాన్‌తో జతకట్టే ప్రయత్నాలు, భారత భూభాగంలో స్వతంత్ర దేశాన్ని స్థాపించాలనే ఆకాంక్షలతో సహా అనేక అంశాలు హైదరాబాద్‌పై చర్యలు తీసుకోవడానికి భారత ప్రభుత్వాన్ని ప్రేరేపించాయి. ఈ కారణాల వల్ల భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని హైదరాబాద్ వేర్పాటువాద ప్రమాదాన్ని అరికట్టాల్సి వచ్చింది. రజాకార్లకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీ ఎలా గెలిచారు? హైదరాబాద్ రీజియన్‌ని దేశంలో విలీనానికి నిజాంని ఒప్పించడానికి చేసిన దౌత్య ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఉద్రిక్తతలు పెరగడంతో నాటి ప్రధాని నెహ్రూ, అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో, హైదరాబాద్‌ని భారత యూనియన్‌లో విలీనం చేయడానికి సెప్టెంబరు 13, 1948న 'ఆపరేషన్ పోలో' అనే పేరుతో సైనిక చర్యను ప్రారంభించాలని నిర్ణయించారు. ఆపరేషన్ పోలో సమయంలో భారత దళాలకు మేజర్ జనరల్ జయంతో నాథ్ చౌదరి(JN Choudhary) నాయకత్వం వహించారు. ఆర్మర్డ్ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఉన్న ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆపరేషన్ పోలో భారత దళాలకు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ జయంతో నాథ్ చౌదరి జె.ఎన్.చౌదరి ప్లాన్‌తో రజాకార్లు ఉక్కిరిబిక్కిరి: రాష్ట్రంపై దాడి జరిగితే భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు లక్షల మంది సైనికులతో కూడిన దళం సిద్ధంగా ఉందని నాటి హైదరాబాద్ ప్రధాని మీర్ లాయిక్ అలీ పేర్కొన్నారు. రజాకార్లు నిజాం సైన్యంలో ఎక్కువ భాగం ఏర్పడ్డారు. ఆపరేషన్ పోలో ఐదు రోజులపాటు యుద్ధంలా సాగింది. మొదటి రెండు రోజుల్లో నిజాం దళాలు భారీగా లొంగిపోయాయి. నిజాం ఆర్మీపై భారత పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించింది. ముఖ్యంగా మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి బలమైన సైనిక వ్యూహాన్ని ప్రదర్శించారు. ది ఎండ్ ఆఫ్ నిజాం రూల్: భారత సైన్యం పదాతిదళం, సాయుధ విభాగాలు , వైమానిక మద్దతుతో కూడిన చక్కటి సమన్వయ విధానాన్ని అవలంబించింది. కీలక పాయింట్లను, వ్యూహాత్మకంగా ముఖ్యమైన నగరాలను వేగంగా స్వాధీనం చేసుకుంది. నిజాం సేనలకు సరఫరా మార్గాలను నిలిపివేసి వారిని ఏకాకిని చేసింది. అతి తక్కువ కాలంలోనే కీలక నగరాలు, ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న ఈ సైనిక చర్య నిజాంని రాష్ట్రం నుంచి తరమికొట్టేలా చేసింది. ఇదంతా ఐదు రోజుల్లోనే ముగిసింది. సెప్టెంబర్ 17 1948న హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాల్పుల విరమణ ప్రకటించారు. సెప్టెంబరు 18న హైదరాబాద్ సైన్యానికి చెందిన జనరల్ ఎల్ ఎడ్రూస్ అధికారికంగా భారత్ సైన్యానికి లొంగిపోయారు. ALSO READ: అదీ ఇండియన్ ఆర్మీ పవర్! గుహలో నక్కిన ఉగ్రవాదులను ఎలా లేపేశారో చూడండి..! #telangana-liberation-day మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి