Khammam Floods: ప్రతీ ఇంటికి సాయం చేస్తాం.. బాధితులందరినీ ఆదుకుంటాం: పొంగులేటి

వరదల కారణంగా నష్టపోయిన బాధితులందరినీ ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు. ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధితుల గుర్తింపునకు అధికారులు వెంటనే సర్వే ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

New Update
Khammam Floods: ప్రతీ ఇంటికి సాయం చేస్తాం.. బాధితులందరినీ ఆదుకుంటాం: పొంగులేటి

వరద కారణంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతీ ఇంటికి సాయం అందిస్తామని, ఎవరూ అధైర్య పడొద్దని భరోసానిచ్చారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల, రామన్నపేట దానవాయిగూడెం, నేలకొండపల్లి మండలంలోని చెరువుమదారం, కట్టుకాచారం రామచంద్రాపురం, సుర్దేపల్లి గ్రామాల్లో పొంగులేటి పర్యటించారు.

బాధిత కుటుంబాలను పరామర్శించారు. రోడ్ల మరమ్మత్తులు, తక్షణ సహాయం, బాధితుల వివరాల సేకరణ పై అధికారులకు మంత్రి సూచనలు చేశారు. బాధితుల గుర్తింపునకు అధికారులు వెంటనే సర్వే ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సర్టిఫికెట్లు, పుస్తకాలు నష్టపోయిన వారికి కూడా న్యాయం చేస్తామని భరోసానిచ్చారు.

తడిసిన బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తామని పొంగులేటి ప్రకటించారు. విద్యుత్ స్తంభాలు, తీగల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీవో గణేష్, R &B ఎస్ఇ హేమలత తదితరులు ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు