Telangana Income: పెరిగిన తెలంగాణ రాష్ట్ర టాక్స్ రాబడి.. ఈ ఆర్ధిక సంవత్సరంలో అంటే 2023-24 లో తెలంగాణ రాష్ట్ర పన్ను ఆదాయాలు పెరిగినట్టు కాగ్ వెల్లడించింది. బడ్జెట్ అంచనాల కంటే, ఏక్కువగా టాక్స్ రాబడి వచ్చినట్టు కాగ్ చెప్పింది. కాగ్ లెక్కల ప్రకారం 2024 మార్చి నాటికి 1.35 లక్షల కోట్లు పన్ను ఆదాయం తెలంగాణకు వచ్చింది. By KVD Varma 17 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Income: తెలంగాణ రాష్ట్రంలో టాక్స్ రాబడి పెరుగుతూ వస్తోంది. గత రెండు ఆర్ధిక సంవత్సరాల్లోనూ పన్ను ఆదాయాలు పెరిగాయి. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ బడ్జెట్ అంచనాల కంటే టాక్స్ రాబడి పెరిగింది. కంప్రోల్టార్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2023-24 ఆర్ధిక సంవత్సరం లెక్కల ప్రకారం 2024 మార్చి నాటికి 1.35 లక్షల కోట్లు పన్ను ఆదాయం తెలంగాణకు వచ్చింది. జీఎస్టీ, రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, సేల్స్ టాక్స్, సెంట్రల్ టాక్స్ లలో వాటా, ఇతర టాక్స్ ఆదాయాలతో ఈ మొత్తం వచ్చినట్టు కాగ్ చెప్పింది. 17 వేల కోట్లు ఎక్కువ.. Telangana Income: బడ్జెట్ ప్రతిపాదనల్లో నాలుగు వేళా కోట్ల రూపాయలు పన్నుల వృద్ధి ఉంటుందని మొదట అంచనా వేశారు. తరువాత సవరించిన అంచనాల కంటే.. ఈ ఏడాది టాక్స్ రాబడి 17 వేల కోట్ల రూపాయలు ఎక్కువగా వచ్చింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మర్చి వరకూ 48 వేల కోట్ల రూపాయాల పన్ను ఆదాయం వచ్చినట్టు కాగ్ వెల్లడించింది. Also Read: హైదరాబాద్ లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు వరుసగా మూడో ఏడాది.. Telangana Income: తెలంగాణకు తొలిసారిగా 2021-22లో బడ్జెట్ ప్రతిపాదనలను మించి టాక్స్ ఆదాయం వచ్చింది. ఆ ఏడాది రూ.1.06 లక్షల కోట్లు పన్ను రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, రూ.1.09 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. అంటే 30 వేళా కోట్ల రూపాయల పెరుగుదల కనిపించింది. ఇక 2022-23లో కూడా బడ్జెట్ ప్రతిపాదనలను మించి టాక్స్ ఆదాయం రికార్డ్ అయింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.31 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని బడ్జెట్ ప్రతిపాదనల్లో అంచనాలు వేశారు. అయితే, మరిన పరిస్థితుల్లో రూ.1.18 లక్షల కోట్లు రాబడి రావచ్చని అంచనాలు సవరించారు. కానీ, అసలు బడ్జెట్ ప్రతిపాదనల కంటే ఎక్కువగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి