సాగర్ ఫ్లైఓవర్ ప్రమాద బాధితులను పరామర్శించిన కేటీఆర్, తలసాని

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ సాగర్‌ రింగ్‌ రోడ్డులో చేపట్టిన ఫ్లైఓవర్‌ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ ర్యాంపు కుప్పకూలింది. దీంతో పది మంది కార్మికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. కాగా ప్రమాదంలో గాయపడిన భాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు.

New Update
సాగర్ ఫ్లైఓవర్ ప్రమాద బాధితులను పరామర్శించిన కేటీఆర్, తలసాని

telangana-hyd-under-construction-flyover-collapse-in-hyderabads-sagar-ring-road-KTR-Talasani-meet-workers-who-injured-in-flyover-collapse

హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌ సాగర్‌ రింగ్‌రోడ్డులో చేపట్టిన ఫ్లైఓవర్‌ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకున్నది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ ర్యాంపు కుప్పకూలింది. దీంతో పది మంది కార్మికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. వారంతా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని వెల్లడించారు. పిల్లర్లపై భారీ ఇనుప వంతెనను సెట్‌ చేస్తుండగా ఓవర్‌ ర్యాంపు వారిపై జారిపడిందని చెప్పారు.

కాగా, అర్ధరాత్రివేళ ప్రమాదం జరగడంతో పెను ముప్పు తప్పింది. ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న ఇంజినీర్ల బృందం..ఫ్లైఓవర్‌ కూలిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

ప్రమాదం జరిగిన తీరును, చికిత్స అందుతున్న తీరును మంత్రి కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు