KCR: కేసీఆర్ పిటిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు!

TG: నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై తీర్పు రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పును వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది. కాగా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

New Update
Telangana Politics: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!

KCR: విద్యుత్ కొనుగోళ్ల కేసులో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు జూన్ 28న విచారణ చేపట్టింది. ప్రభుత్వం, కేసీఆర్ తరఫున న్యాయవాదుల వాదన విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పును వెలువరించనుంది. కాగా కేసీఆర్ వేసిన పిటిషన్ పై ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఒకవేళ కేసీఆర్ అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తే రేవంత్ సర్కార్ కు ఇది పేద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లే అని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతోంది. మరి కేసీఆర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.

ఇటీవల 12 పేజీలతో లేఖ..

ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. మా హయాంలో కరెంట్ విషయంలో గణనీయ మార్పు చూపించమని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈ నెల 15తో గడువు ముగియడంతో కేసీఆర్ లేఖ రాశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు