TSPSC Group-1: గ్రూప్-1 రద్దుపై హైకోర్టులో విచారణ.. టీఎస్పీఎస్సీకి కీలక ఆదేశాలు

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని తెలిపింది. రేపటికి ఈ పిటిషన్ ను వాయిదా వేసింది ధర్మాసనం.

New Update
TSPSC Group 1: తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రద్దు!

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రద్దుపై (TSPSC Group-1) సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని తెలిపింది. రేపటికి ఈ పిటిషన్ ను వాయిదా వేసింది ధర్మాసనం. బయోమెట్రిక్‌ విధానం అమలు చేయడం వల్ల కలిగిన ఇబ్బందులేంటో చెప్పాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది హైకోర్టు. గతంలో అలా అమలు చేసిన పరీక్షల వివరాలను చెప్పాలని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా బయోమెట్రిక్‌ ను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని తెలిపింది.

ఇంకా పలు విషయాలపై టీఎస్పీఎస్పీపై తీవ్ర వాఖ్యలు చేసింది హైకోర్టు. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ను మీరే అమలు చేయకపోతే ఎలా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఒక సారి పరీక్ష రద్దు అయిన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలి కదా అని మందలించింది. నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ కు ఉంటుంది కదా అని వాఖ్యానించింది. ఈ పరిణామాల కారణంగా టీఎస్పీఎస్సీ ప్రతిష్ట, విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని వాఖ్యానించింది. బయోమెట్రిక్ హాజరుపై టీఎస్పీఎస్సీ సమర్పించిన వివరాలు ఆధారంగా తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 రద్దు అంశంపై తేలనుంది.

పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థిస్తే.. పరీక్షను మళ్లీ తప్పక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రేపు హైకోర్టు డివిజన్ బెంచ్ తీసుకునే నిర్ణయంపై 2.30 లక్షల మంది అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. టీఎస్పీఎస్సీలోనూ ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. హైకోర్టు డివిజన్ బెంచ్ లోనూ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తోంది టీఎస్పీఎస్సీ.
ఇది కూడా చదవండి:
Kishan Reddy: 6 లక్షల మందికి మోదీ సర్కార్ జాబ్స్.. మరి కేసీఆర్ ప్రభుత్వం సంగతేంటి?: కిషన్ రెడ్డి

Advertisment
Advertisment
తాజా కథనాలు