TG High Court: కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్‌షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది.

New Update
TG High Court: కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్‌షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు స్పీకర్‌ కార్యాలయ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ గడువులోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోతే తాము సుమోటోగా ఈ కేసు విచారణ చేపడుతామని హైకోర్టు తెలిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందగౌడ్ దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని పిటిషన్ వేయగా.. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు నాలుగు వారాల్లో ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది హైకోర్టు విచారించగా.. సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్‌ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

Also Read : Uttara Pradesh: పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌…తప్పిన పెను ప్రమాదం!

Advertisment
Advertisment
తాజా కథనాలు