Traffic challan: వాహనదారులకు గుడ్ న్యూస్... చలాన్లపై మరోసారి రాయితీ!

తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలానాలు కట్టలేక ఇబ్బంది పడుతున్నవారికి గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. 2022 లో మాదిరి ఈసారి కూడా ట్రాఫిక్ చలానాలపై రాయితీ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారట.

New Update
Bengaluru:270సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ..1.36 లక్షల జరిమానా

Traffic Challans Discount: రాష్ట్రంలోని వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం పెండింగ్ లో ట్రాఫిక్ చలాన్లకు వాసులు చేసేందుకు చెప్పటిన రాయితీ విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరోసారి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది అధికారిక వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీనిపై ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని.. త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక జీవో జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ALSO READ: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

2022లో గత ప్రభుత్వం చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు కొత్త విధానాన్ని అమలు చేసింది. అదేంటంటే ట్రాఫిక్ చలానాలపై రాయితీ ప్రకటించడం. 2022లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ఖజానాలోకి భారీ డబ్బు సమకూరింది. ట్రాఫిక్ చలానాలు ప్రజలు కట్టరనుకున్న పోలీసుల ఆలోచలనకు వాహనదారులు ఊహించని షాక్ ఇచ్చారు. రాయితీ ఉండడంతో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న చలానాలు కూడా కట్టేశారు జనాలు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెండింగ్ చలానాలు కట్టడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.300 కోట్లు జమ అయ్యాయి. అయితే ఇదే మాదిరిగా వాహనదారులకు ఈ పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాల నుంచి రిలీఫ్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారట. మరోసారి చలానాలపై రాయితీ ఇవ్వనున్నారట.

ALSO READ: నేడు భారత్ బంద్… మావోయిస్టుల పిలుపు

2022లో ట్రాఫిక్ చలానాలపై రాయితీ ఇలా..

2022 మార్చి 31 నాటికి తెలంగాణలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించింది రాష్ట్ర సర్కార్. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ అవకాశాన్ని 65 శాతం మంది వాహనదారులు ఉపయోగించుకున్నట్లు సమాచారం. తాజాగా గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ రెండు కోట్లకు చేరుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి రాయితీ ప్రకటించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు