Land Rates: తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు

TG: రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఈ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు.

New Update
Land Rates: తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు

Increase in Land Rates: తెలంగాణలో భూముల ధరలు పెరగనున్నాయి. భూముల విలువల సవరణకు రేవంత్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు అమలు చేయనుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 18 నుంచి భూముల విలువల సవరణ ప్రక్రియ ప్రారంభించనుంది. జులై 31నాటికి మార్కెట్‌ విలువను ఫైనల్‌ చేయనున్న రాష్ట్ర సర్కార్. భూముల విలువను అంచనా వేసేందుకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు రూపొందిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలవారీగా మార్కెట్‌ విలువల సవరిస్తోంది.

మార్కెట్‌ రేటుకు ..ప్రభుత్వ ధరకు తేడా ఉండటంతో భూముల విలువల సవరణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ చేపట్టింది. పాత మార్కెట్‌ విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు అధికారుల అధ్యయనం చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యంతరాల నమోదుకు ప్రజలకు 15రోజుల గడువు ఇవ్వనుంది. సవరించిన ధరలు ఆగస్ట్‌ 1 నుంచి అమల్లోకి తేనుంది రేవంత్ సర్కార్. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలతో మార్కెట్‌ ధరలపై అంచనా వేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను ఆధారంగా చేసుకొని విలువ నిర్థారణ చేయనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది.

కార్యాచరణ ఇలా..

    • రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వే అధికారులతో సమావేశం: 18.6.2024
    • మార్కెట్‌ విలువల సవరణ పూర్తి: 23.6.2024
    • పునస్సమీక్ష : 25.6.2024
    • కమిటీ ఆమోదం : 29.6.2024
    • వెబ్‌సైట్‌లో సవరించిన విలువల ప్రదర్శన : 1.7.2024
    • సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం: 20.7.2024
    • శాఖ వెబ్‌సైట్‌లో కొత్త ధరల అప్‌డేషన్‌: 31.7.2024
    • సవరించిన ధరల అమలు: 1.8.2024 నుంచి

Advertisment
Advertisment
తాజా కథనాలు