/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Real-Police-CV-Anand.jpg)
ఠాగూర్ సినిమా గుర్తింది కదా..? లంచగొండుల గుండెలో నిదురించిన సింహంలా మెప్పించిన చిరంజీవి బాక్సాఫిస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశాడు. అయితే అదంతా సినిమా.. కానీ రియల్ లైఫ్‌లోనూ ఓ ఠాగూర్ ఉన్నారు. అది కూడా మన తెలంగాణలోనే..! లంచాలు తీసుకుంటున్నవారి భరతం పడుతున్నారాయన. తెలంగాణ ఏసీబీ డీజీగా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ దెబ్బకు లంచగొండు అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లంచాలు తీసుకోవాలంటేనే ప్రభుత్వ అధికారులు హడలిపోయారు. నిత్యం ఎక్కడో ఒక చోటా బడా ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కుతుండడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ లంచం…అదే సగటు భారతీయుడి ఆవేదన.. అదే సీవీ ఆనంద్ ఆవేదన కూడా.. అవినీతిని అంతం చేసేందుకు ఆయన ఫుల్ యాక్టివ్ అయ్యారు. అందుకే ఏసీబీ ద్వారా లంచగొండుల గుండెల్లో వణుకుపుట్టిస్తున్నారు. నిజానికి ప్రజల్లో ఏసీబీ పట్ల ఒక అభిప్రాయం ఉంది. ఏసీబీ కేవలం చిన్నచిన్న ప్రభుత్వ అధికారులనే పట్టుకుంటుందని.. పెద్ద పెద్ద తిమింగలాలను పట్టించుకోదన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇదంతా రాంగ్ అని ప్రూవ్ చేశారు సీవీ ఆనంద్. ఏసీబీ వలలో చిక్కుతున్న లంచగొండు అధికారుల్లో దాదాపు అన్ని పెద్దచేపలే కనిపిస్తున్నాయి.
This gives ACB and me , the confidence that we are on the right track ! 😅 https://t.co/yaDE9p3TLz
— CV Anand IPS (@CVAnandIPS) September 4, 2024
5 వేలు, 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డ అధికారుల గురించి వింటూ వస్తున్న జనాలకు చాలా రోజులుగా లక్షలు రూపాయలు తీసుకుంటూ దొరుకుతున్న అధికారులను కనిపిస్తున్నారు. దీంతో ప్రజలు ఏసీబీని తెగ మెచ్చుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే లంచం తీసుకున్న అధికారులు ఆ డబ్బును తిరిగి సంబంధిత వ్యక్తికి ఇచ్చేస్తుండడం విడ్డూరం. ఠాగూర్ సినిమాలోనూ ఇదే జరిగింది. ఇక్కడ తెలంగాణలోనూ అదే జరుగుతోంది. లంచం తీసుకోవాలంటేనే అధికారులు వణికిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా పోలీసు అధికారులు లంచం ఇచ్చినవారి కోసం వెతికి మరీ స్వయంగా వారి ప్లేస్‌లకు వెళ్లి డబ్బులు వాపస్ ఇస్తున్నారు!
ACB traps and arrests MV Bhoopal Reddy, Joint Collector and Senior Assistant Y.Madan Mohan Reddy of Rangareddy district collectorate who colluded and abused their official positions. They were caught redhanded while accepting bribe of Rs 8,00,000 from the complainant for removal… pic.twitter.com/6cN2qastGH
— CV Anand IPS (@CVAnandIPS) August 13, 2024
సీవీ ఆనంద్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన డిసెంబర్ 24, 2021 నుంచి అక్టోబర్ 12, 2023 వరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఇక 2017లో అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా, 2021లో కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి అందుకున్నారు. అడిషనల్ డీజీగా ఉన్నా సీవీ ఆనంద్‌కు డీజీపీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్ట్ 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత సీవీ ఆనంద్ కొత్త బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఏసీబీ డీజీగా ఆయన్ను రేవంత్ సర్కార్ నియమించింది.
ACB registered a Disproportionate Assets case against D. Narendar, Superintendent, Municipal Corporation, Nizamabad.
Searches at his residence and other locations led to the seizure of assets worth Rs 6.7 crores which include Rs 2.93 crore Cash, ₹1.1 Cr in bank , 51 tula… pic.twitter.com/Mnz94EEiX1
— CV Anand IPS (@CVAnandIPS) August 9, 2024
అయితే.. అత్యంత కీలకమైన హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతల సమస్యలు నిత్యం తలెత్తుతుండడంతో ఆయనను నగర కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం. గత ఎన్నికల ముందు వరకు కూడా ఆయన హైదరాబాద్ సీపీగా పని చేశారు. కానీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయనను ఈసీ బాధ్యతల నుంచి తప్పించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆనంద్ ను ఏసీబీ చీఫ్ గా నియమించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయనను తిరగి హైదరాబాద్ సీపీగా నియమించింది ప్రభుత్వం. ఏసీపీ డీజీగా విజయ్‌కుమార్ ను నియమించింది. అయితే.. ఆనంద్ వెళ్లిన తర్వాత కూడా ఏసీబీ ఇప్పటి దూకుడునే కొనసాగిస్తుందా? లేదా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
A.Venkatesham, Inspector of Police; SHO-Suraram Police Station, Cyberabad Commissionerate, was caught by #ACBOfficials for demanding Rs.5,00,000/- and accepting Rs.1,00,000/- from a Person for allowing development work in his land at Gajularamaram Village. The Inspector had… pic.twitter.com/vvcp2KJLky
— ACB Telangana (@TelanganaACB) June 21, 2024
Rachakonda Commissionerate Kushaiguda Inspector G.Veera Swamy, Shaik Shafi, SI of Police were caught by #ACBofficials at the #KushaigudaPoliceStation for accepting #bribe amount of ₹ 3,00,000/- to close a case. The bribe amount was accepted through L. Upender, Private person.… pic.twitter.com/hESkg8fmW3
— ACB Telangana (@TelanganaACB) May 31, 2024
Rachakonda Commissionerate Kushaiguda Inspector G.Veera Swamy, Shaik Shafi, SI of Police were caught by #ACBofficials at the #KushaigudaPoliceStation for accepting #bribe amount of ₹ 3,00,000/- to close a case. The bribe amount was accepted through L. Upender, Private person.… pic.twitter.com/hESkg8fmW3
— ACB Telangana (@TelanganaACB) May 31, 2024
ఇక సీవీ ఆనంద్ మంది క్రికెటర్ కూడా. భారత్ తరుఫున అండర్- 19 టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు ఆనంద్. ఇక హైదరాబాద్ అండర్ - 19, అండర్-22 జట్టులో ఆడారు. అటు టెన్నిస్‌లోనూ రాణించారు. అల్ ఇండియా పోలీస్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌లో సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఆయన నేషనల్ పోలీస్ అకాడమీలో అథెటిక్స్ విభాగంలో 8 గోల్డ్ మెడల్స్ గెలిచారు. ఇలా అటు క్రీడాలలోనూ ఇటు వివిధ హోదాల్లో పని చేసిన ప్రభుత్వ అధికారిగానూ సీవీ ఆనంద్ తనదైన మార్క్ చూపిస్తూ ప్రజల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నారు.
Hi, Who’s this school mate ?
Yes , I used to do 5 events - 100 mts , 200 mts , High Jump , Ling Jump and Triple Jump - right through college and was the Best athlete in National Police Academy . My 100 mts timing was 11.2 seconds . These are my athletics medals 👇👇 https://t.co/B0hQDSrJFe pic.twitter.com/KG9niRvfas— CV Anand IPS (@CVAnandIPS) August 8, 2024
Baisaran Valley: బైసరన్ లోయపై అఖిలపక్ష భేటీలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు!
పహల్గాంలోని బైసరన్ లోయ ఉగ్రదాడిపై అఖిలపక్ష భేటీలో భద్రతా వైఫల్యంపై తీవ్ర చర్చ జరిగింది. స్థానిక అధికారులు ముందుగా సమాచారం ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపనున్నట్లు వెల్లడించింది.
Baisaran Valley
Baisaran Valley: జమ్మూ కశ్మీర్‌లోని(Jammu and Kashmir) పహల్గాం(Pahalgam) సమీపంలో ఉన్న బైసరన్ లోయలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి(Terror Attack) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో(All Party Meeting) ఉగ్రదాడి అంశంపై కీలక చర్చలు జరిగాయి. ఈ దాడిపై విపక్షాలు భద్రతా యంత్రాంగ వైఫల్యాన్ని ప్రధానంగా కారణంగా ఎత్తిచూపాయి.
Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'
దాడి జరిగిన ప్రదేశమైన బైసరన్‌కు పర్యాటకులను అనుమతించిన విషయాన్ని స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు ముందుగా తెలియచేయలేదన్న విషయం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశాన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడా తమ కథనాల్లో ప్రస్తావించాయి.
అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra) ప్రారంభమయ్యే జూన్ నెల వరకు సాధారణంగా బైసరన్ వంటి ప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈసారి స్థానిక పాలనా యంత్రాంగం ఎటువంటి సమాచారాన్ని భద్రతా వ్యవస్థలతో పంచుకోకుండా పర్యాటకులకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
విపక్షాల తీవ్ర విమర్శలు..
ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే కనీసం 45 నిమిషాల నడక అవసరం. అలాంటి చోట ఎమర్జెన్సీ పరిస్థితులకు స్పందించే విధంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమల్లో లేకపోవడాన్ని కూడా కేంద్ర ప్రతినిధులు అఖిలపక్ష భేటీలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
విపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దాడి జరిగిన సమయంలో భద్రతా బలగాలు ఎక్కడ ఉన్నాయనే ప్రశ్నలు గట్టిగా లేవనెత్తుతున్నాయి. అలాగే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ స్పందనపై అనేక ప్రశ్నలు సాధించారని సమాచారం.
"మహారాష్ట్ర ట్రావెల్ ఏజెన్సీలు బైసరన్ తెరిచిన విషయం తెలుసుకోగలిగితే, భద్రతా సిబ్బందికి అది తెలియకపోవడం ఎలా?" అంటూ మరో ఎంపీ సుప్రియా సూలే(Supriya Sule) అనుమానాన్ని వ్యక్తం చేశారు.
Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
పహల్గాం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బైసరన్ ప్రాంతాన్ని "మినీ స్విట్జర్లాండ్"గా పిలుస్తుంటారు. ఇక్కడి పచ్చని చెట్లు, దట్టమైన అడవులు, అందమైన పర్వత దృశ్యాలు వేసవికాలంలో వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి.
అయితే, ఏప్రిల్ 22న ఇక్కడ జరిగిన దారుణం ఎప్పటికీ మరువలేనిది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు, అమాయక పర్యాటకులను చుట్టుముట్టి సమీపం నుంచి కాల్పులకు పాల్పడి 28 మంది ప్రాణాలు హరించారు. ఈ దాడి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
ఈ నేపథ్యంలో భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తగా, అఖిలపక్ష సమావేశం లో వాటిపై తీవ్రమైన చర్చ జరిగింది. కేంద్రం ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు జరిపి, బాధ్యత వహించాల్సిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలుపుతోంది.
Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!
ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర
Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం
HYD fire accident: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్ని జ్వాలలు
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్ఎఫ్ యూ టర్న్