/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T143055.860.jpg)
Gaddar Death Anniversary: తెలంగాణ ఉద్యమ పోరాటంలో తన పాటలతో యావత్ ప్రజలను ఉత్తేజపరిచిన గొప్ప విప్లవకవి గద్దరన్న. పొడుస్తున్న పొద్దు మీద.. అమ్మ అమ్మా తెలంగాణమ్మా’ విప్లవాత్మక పాటలు ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని రగిల్చాయి. పేదల రాజ్యమే అంతిమ లక్ష్యంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం. పీడిత ప్రజల గొంతుకగా నిలిచి పాటకు పోరాటం నేర్పిన ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. నేటితో ఈ విప్లవ గీతం మూగబోయి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా గద్దర్ యాదిలో ఆయనను స్మరిస్తూ ప్రముఖులు, రాజకీయ వేత్తలు ఘన నివాళులు అర్పిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సజ్జనార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పలువురు ఘన నివాళులు తెలియజేశారు.
పాటకు పోరాటం నేర్పి…
తన గళంలో తూటాగా మార్చి…
అన్యాయం పై ఎక్కుపెట్టిన…
తెలంగాణ సాంస్కృతిక శిఖరం…గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.#RememberingGaddar #Gaddar pic.twitter.com/FUJ5qJh86f
— Revanth Reddy (@revanth_anumula) August 6, 2024
ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి ప్రథమ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయునికి ఘన నివాళి. 💐💐#Gaddar https://t.co/SLltINN4Lt
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 6, 2024
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాడిత పీడిత వర్గాలకు సామాన్యాయం కోసం తన పాటల ద్వారా జీవితాంతం పోరాటం చేసిన విప్లవకవి, గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న గారి వర్ధంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు #Gaddar pic.twitter.com/lTEXWx3My5
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) August 6, 2024
విప్లవ కవి, ప్రజాయుద్ధనౌక శ్రీ గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు.
On the occasion of the death anniversary of revolutionary poet and people's warrior Sri Gaddar, we pay our heartfelt tributes to him.#Gaddar #TributeToGaddar #DeathAnniversary… pic.twitter.com/JB9EgOZqFi
— Dr. Mallu Ravi (@DrMalluRavi1) August 6, 2024
తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు#Telangana #Gaddar #Vardanti #Congress pic.twitter.com/0KmTmhjazH
— Ponguleti Srinivasa Reddy (@mpponguleti) August 6, 2024
ప్రజాయుద్ధనౌక..
అణగారిన వర్గాల గొంతుక..
తెలంగాణ ఉద్యమ రణగర్జన
నిత్యచైతన్య విప్లవజ్వాల
స్వర్గీయ గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా
నా నివాళులు. 🙏#Telangana #gaddar @revanth_anumula @Bhatti_Mallu @TelanganaCMO @INCTelangana pic.twitter.com/UIbbX4RQAM— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 6, 2024
పపంచ వ్యాప్తంగా ఉన్న తాడిత పీడిత వర్గాలకు సామాన్యాయం కోసం తన పాటల ద్వారా జీవితాంతం పోరాటం చేసిన విప్లవకవి, గాయకుడు గద్దర్ అన్న గారి వర్ధంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు!!#Gaddar pic.twitter.com/RddxkhIRHZ
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) August 6, 2024
పాటకు పోరాటం నేర్పిన మహనీయుడు, తన గళాన్నితూటాగా మార్చి.. అన్యాయం పై ఎక్కుపెట్టిన ప్రజాయుద్ధ నౌక, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి తన పాటలతో పోరాటం చేసిన గద్దరన్న వర్ధంతి నేడు.
Read More:https://t.co/CmqtkJRybn#gaddar #deathanniversary #Telangana #RTV— RTV (@RTVnewsnetwork) August 6, 2024
Also Read: Gaddar Death Anniversary : గద్దరన్న యాదిలో.. పాటలతో అభిమానుల ఘన నివాళి! - Rtvlive.com