Amit Shah: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేసిన అమిత్ షా.. బీఆర్ఎస్ టార్గెట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటానికి.. కవిత జైలుకు పోకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలు, విధానాలు ఏమీ లేవని విమర్శించారు. By Shiva.K 10 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Amit Shah Comments on CM KCR: బీఆర్ఎస్ టార్గెట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్(KTR)ను ముఖ్యమంత్రిని చేయటానికి.. కవిత(MLC Kavitha) జైలుకు పోకుండా కాపాడుకోవడానికి కేసీఆర్(CM KCR) ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలు, విధానాలు ఏమీ లేవని విమర్శించారు. ఆదిలాబాద్ సభ అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన అమిత్ షా.. బీజేపీ ఆధ్వర్యంలో సిక్ విలేజ్ లోని ఇంపీరీయల్ గార్డెన్స్‌లో నిర్వహించిన మేధావుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి.. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందన్నారు. పదేళ్లు అవినీతిలో మునిగిపోయిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వొద్దని అన్నారు. రానున్న ఐదేళ్లు మంచి పాలన ఎవరు ఇవ్వగలరో తెలంగాణ సమాజం ఆలోచించాలని మేథావులకు సూచించారు అమిత్ షా. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారాయన. జన సంద్రమైన ఆదిలాబాద్ "జనగర్జన"...! ఎన్నికల శంఖారావం మోగించిన కేంద్ర హోం మంత్రి శ్రీ @AmitShah గారు కార్యకర్తల ఉత్సాహంతో హోరెత్తిన సభా ప్రాంగణం తెలంగాణ నేలపై బిజెపి ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు నేటితో శ్రీకారం#TelanganaWithBJP pic.twitter.com/yJd3LY4T43 — BJP Telangana (@BJP4Telangana) October 10, 2023 మోదీ ఇస్తున్న గ్యారంటీ.. ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మూడోసారి మోదీ ప్రభుత్వం రాగానే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా మారనుందని, ఇదీ మోదీ ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీ అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే దేశం 5వ ఆర్థిక దేశంగా అవతరించిందన్నారు. రూ. 220 కోట్ల మందికి మోదీ ఉచిత వ్యాక్సిన్ అందించారని కరోనా నాటి పరిస్థితులను వివరించారు ఎంపీ లక్ష్మణ్. సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా జీ20 సదస్సును నిర్వహించారని చెప్పారు. దేశాన్ని ఏకతాటికిపైకి తెచ్చి జీఎస్టీని అమలు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. ట్రిపుల్ తలాక రద్దు, 370 ఆర్టికల్ రద్దు, 33శాతం మహిళలకు రిజర్వేషన్ల కల్పన, అయోధ్య రామాలయం పూర్తి.. వంటి దశాబ్దాల సమస్యలను పరిష్కరించిన నాయకుడు మోదీ అని ప్రశంసలు కురిపించారు ఎంపీ లక్ష్మణ్. దేశ వ్యాప్తంగా 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించారని పేర్కొన్నారు ఎంపీ లక్ష్మణ్. 80 కోట్ల మందికి బియ్యం పంపిణీ చేశారన్నారు. ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని మేధావులు మౌనం వీడాలని పిలుపునిచ్చారు ఎంపీ లక్ష్మణ్. మోదీ తొమ్మిదేళ్ల పాలన చూసి తెలంగాణలో బీజేపీని గెలిపించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారాయన. ఉచితాలకు - సంక్షేమ పథకాల మధ్య లక్ష్మణ రేఖ ఉండాలని అభిప్రాయపడ్డారు. యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు. మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు అని, తెలంగాణ ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈసారి బీజేపీని గెలిపించాలని కోరారు ఎంపీ లక్ష్మణ్. భారీగా తరలి వచ్చిన మేధావులు.. ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరిగిన మేధావుల సదస్సులో ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రకాస్ జవడేకకర్, ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి, రాచంద్రరావు, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక అమిత్ షాతో సదస్సుకు వివిధ వర్గాలకు చెందిన మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ లో వివిధ రంగాల నిపుణులు...మేధావులతో కేంద్ర హోం మంత్రి శ్రీ @AmitShah గారి కీలక సమావేశం భవిష్యత్ తెలంగాణ పయనానికి నేటి సమావేశం నాంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి ఒక్క బిజెపికి మాత్రమే ఉందని వ్యక్తమైన ఏకాభిప్రాయం.#TelanganaWithBJP pic.twitter.com/qY0atLOyin — BJP Telangana (@BJP4Telangana) October 10, 2023 Also Read: TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..! Nara Lokesh CID: ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ #mlc-kavitha #cm-kcr #telangana-elections-2023 #minister-ktr #amit-shah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి