/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/BJP-MANIFESTO-jpg.webp)
Telangana Elections 2023: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోను ప్రకటించి ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను కేంద్రహోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ అనే పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు.
తెలంగాణను ప్రగతి పథంలో నడిపేందుకు దశ(10) అంశాల కార్యాచరణతో రూపొందించిన బీజేపీ మేనిఫెస్టో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రజలందరికీ సుపరిపాలన.. సమర్థవంతమైన పాలనపై దృష్టి
* అవీనితిని ఉక్కుపాదంతో అణచివేయడంతోపాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' నినాదంతో సుపరిపాలన
* ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించడం ద్వారా పెట్రోల్ ఉత్పత్తుల ధరల తగ్గింపు
* ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన 'మీ భూమి' వ్యవస్థ
* కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు
* తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం
* ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు
* బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన కుంభకోణాలన్నింటిపై విచారణ కమిటీని ఏర్పాటు. దోషులు న్యాయస్థానం ముందుకు
* వరికి రూ.3100 మద్దతు ధర, ప్రతీ రైతుకు దేశీయ ఆవు