BREAKING: మంత్రి మల్లారెడ్డికి బిగ్ రిలీఫ్

మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

New Update
BREAKING: మంత్రి మల్లారెడ్డికి బిగ్ రిలీఫ్

Telangana Elections: మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. సంబంధిత రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. మల్లారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ అంజిరెడ్డి కోర్టును కోరారు. మల్లారెడ్డి అఫిడవిట్ అభ్యంతరాలపై ఫిర్యాదుదారుడికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చినట్లు ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మసనం ఆ పిటిషన్ ను కొట్టేస్డింది.

ALSO READ: ధరణిలో లోపాలు.. కామారెడ్డిలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

అసలేం జరిగిందంటే?

ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి మల్లారెడ్డి తన ఎడ్యూకేషన్ క్వాలిఫికేషన్‌ను తప్పుగా చూపించినట్లు కంప్లైంట్ ఇచ్చారు అంజిరెడ్డి అనే వ్యక్తి. మూడు ఎన్నికల్లో మూడు రకాలుగా ఎడ్యూకేషన్ డీటైల్స్ పేర్కొన్నారు మల్లారెడ్డి. 1973లో ఇంటర్ చేసినట్లు చూపారు మల్లారెడ్డి. అయితే, గత మూడు ఎన్నికల అఫిడవిట్లలో మూడు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివినట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడిదే వివాదాస్పదంగా మారింది.

ALSO READ: బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటెయ్యండి: అమిత్ షా పిలుపు

మల్లారెడ్డి గత, ప్రస్తుత అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఇంటర్మీడియట్ చదివినట్లుగా పేర్కొన్న కాలేజీల వివరాలివి. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో తాను ప్యాట్నీ గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంటర్ చదివినట్లుగా పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో తాను వెస్లీ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదివినట్లు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు