Telangana Elections: మహిళా ప్రతినిధుల్లో సరికొత్త జోష్.. కాంగ్రెస్ నుంచి ఎంతమంది పోటీకి సిద్ధమయ్యారో తెలిస్తే అవాక్కే.. తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు అందనంత స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయదల్చుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది పోటీకి సై అన్నారు. ఇందులో పురుషులతో పాటుగా మహిళలు సైతం పోటీకి ముందుకొచ్చారు. By Shiva.K 03 Sep 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections: తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్(BRS) 115 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు అందనంత స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కాంగ్రెస్(Congress) కూడా దూకుడు పెంచింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయదల్చుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది పోటీకి సై అన్నారు. ఇందులో పురుషులతో పాటుగా మహిళలు సైతం పోటీకి ముందుకొచ్చారు. మొత్తం తెలంగాణ(Telangana)లో ఉన్న 119 నిమోజకవర్గాల నుంచి 1005 మంది ఆశావహులు పోటీకి సై అంటూ దరఖాస్తులు చేసుకున్నారు. అయితే, వీరిలో మహిళలూ ఉన్నారు. దాదాపు 70 మంది మహిళలు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేందుకు సిద్ధం అంటూ ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తరువాత మహిళల నుంచి అత్యధికంగా దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి. వీరిలో ములుగు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎమ్మెల్యే డి అనసూయ (సీతక్క), కోదాడ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి (ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య), వరంగల్ తూర్పు నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ వంటి అభ్యర్థులకు దాదాపు టిక్కెట్ ఖరారైనట్లే చెప్పుకోవచ్చు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఖైరతాబాద్ స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ మాజీ సీఎల్పీ నేత, దివంగత నాయకుడు పీ జనార్దన్ రెడ్డి కుమార్తె కె విజయారెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పోటీ చేసిన 100 స్థానాల్లో 11 మంది మహిళలకు టిక్కెట్లు ఇవ్వగా, మిగిలిన 19 స్థానాలను మహాకూటమి భాగస్వామ్య పక్షాలు, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లకు వదిలిపెట్టింది. ఈ 11 మంది మహిళా అభ్యర్థుల్లో సీతక్క, హరిప్రియ నాయక్, సబితా ఇంద్రారెడ్డి సహా ముగ్గురు విజయం సాధించారు. అయితే, ఎన్నికల తరువాత హరిప్రియ నాయక్, సబితా ఇంద్రా రెడ్డి కాంగ్రెస్‌ను వీడి అధికార బీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు. సబితకు క్యాబినెట్‌లో చోటు కూడా కల్పించింది బీఆర్‌ఎస్ అధినాయకత్వం. ఆగస్టు 21న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన 115 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో కూడా ఏడుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మహిళలకు నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చినప్పటికీ, ఈసారి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను పార్టీ నుండి తొలగించింది. అయినప్పటికీ ఆ పార్టీలో మహిళ సంఖ్య ఏడుకు చేరుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అయిన రేఖా నాయక్ పార్టీకి రాజీనామా చేయకుండానే.. ఖానాపూర్ నుండి కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2014లో 7.5 శాతం ప్రాతినిథ్యం.. 2018 ఎన్నికలలో, ఆరుగురు మహిళలు గెలుపొందారు. ఇందులో BRS నుండి ముగ్గురు, కాంగ్రెస్ నుండి ముగ్గురు అసెంబ్లీకి వచ్చారు. ఫలితంగా 2014 అసెంబ్లీలో 7.5% ఉన్న వారి ప్రాతినిథ్యం.. 2018లో 5 శాతానికి తగ్గింది. 2014-18 సభలో తొమ్మిది మంది మహిళా ప్రతినిథులు ఉన్నారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి, ఖానాపూర్ నుంచి రేఖా నాయక్, ఆలేరు నుంచి గొంగిడి సునీత (ముగ్గురూ బీఆర్‌ఎస్), ములుగు నుంచి సీతక్క, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఇల్లందు నుంచి హరిప్రియ నాయక్ (కాంగ్రెస్) గెలిచారు. ఇక, 2018లో మహాకూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పోటీ చేసిన 14 స్థానాల్లో ఒక చోట మహిళకు బీ-ఫారం ఇవ్వగా, కూటమిలో భాగస్వామి అయిన తెలంగాణ జనసమితి కూడా భవానీరెడ్డికి టికెట్ ఇచ్చింది. ఆమె సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఇక బీజేపీ 14 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. AIMIM ఎనిమిది మంది అభ్యర్థులను నిలబెట్టినా.. అందులో మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) 10 మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. 2108 ఎన్నికల నాటి లెక్కలు ఇలా ఉన్నాయి. మరి త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఏ పార్టీలు ఎంత మంది మహిళలకు అవకాశం ఇస్తారు? ఏ పార్టీ నుంచి ఎంత మంది మహిళలు గెలుపొందుతారు. కొత్త అసెంబ్లీకి ఎంత మంది మహిళా ప్రతినిధులు హాజరవుతారనేది చూడాలి. Also Read: SoniaGandhi: మరోసారి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ Telangana Elections: జనగామ ఎమ్మెల్యేనా మజాకా.. టౌన్ సెంటర్‌లో చొక్కా విప్పిన ముత్తిరెడ్డి.. అసలేమైందంటే.. #telangana-elections #congress-party #telangana-politics #telangana-congress #brs-candidates-first-list మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి