Telangana Elections 2023: ఎన్నికల సిబ్బంది ఎప్పుడు ఏం చేయాలంటే? By Bhoomi 30 Nov 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఈసీ విధివిధానాలు రూపొందించింది. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు ఎన్నికల అధికారులు కీలక పాత్ర పోషించనున్నారు. పోలింగ్ విధానంలో పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది మూడు విడతల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారిపాత్ర కీలకమైంది. శిక్షణలో అన్ని విషయాలు చెప్పి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది పోలింగ్ రోజు, ముందు రోజు చేయాల్సిన పనులు,నియమ నిబంధల గురించి తెలుసుకుందాం. 30న పోలింగ్ రోజు చేయాల్సిన విధులు: - ఉదయం 5.15 గంటల వరకు ఈవీఎంను రెడీ చేసుకుని...5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. - పోలింగ్ ఏజెంట్లను స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, కండువాలు , టోపీలతో అనుమతించకూడదు. - ఉదయం 5.30 గంటల వరకు పోలింగ్ ఏజెంట్లు హాజరుకానట్లయితే... 15 నిమిషాలు వేచి ఉండి 5.45 గంటలకు వారు రాకున్నా సూక్ష్మ పరిశీలకుడి పర్యవేక్షణలో పోలింగ్ సిబ్బందితోనే నమూనా పోలింగ్ ప్రారంభించాలి. - నమూనా పోలింగ్‌కు సంబంధించిన ధ్రువ పత్రాన్ని రెడీ చేసి... దానిపై పీవో సంతకం తీసుకోవాలి. ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకోవాలి. -నమూనా పోలింగ్ సమయంలో CU, BU, VV PAT సరిగ్గా పనిచేయకుంటే వాటిని మార్చి కొత్త ఈవీఎంతో మాక్ పోలింగ్ నిర్వహించాలి. వీవీ ప్యాట్‌లో సమస్య ఉంటే అదొక్కటే మార్పు చేయాలి. -నమూనా ప్రక్రియను ముగిసాక... ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా చూడాలి. -రెండో పోలింగ్ అధికారి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుపై సిరాతో గోరు చివరి నుంచి కణుపు వరకు అంటించాలి. ఓటర్ల రిజిస్టర్‌లో అతనితో సంతకం చేయించుకొని వివరాలు ఈసీకి అందజేసిన చీటీలో నమోదు చేసి మూడో పోలింగ్ అధికారి వద్దకు పంపాలి. -3వ పోలింగ్ అధికారి ఓటరు నుంచి చీటీని తీసుకొని ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి పంపించాలి. కంట్రోల్ యూనిట్‌లో పోలింగ్ అధికారి బటన్ నొక్కగానే కంపార్ట్‌మెంట్‌లోని బ్యాలెట్ యూనిట్‌లో ఓటరు ఓటుహక్కు వినియోగించుకునేందుకు అనుమతి లభిస్తుంది. - పోలింగ్ ప్రారంభించిన తరువాత మధ్యలో బీయూ లేదా సీయూ సరిగ్గా పనిచేయనట్లయితే... ఆ రెండింటితో పాటు వీవీ ప్యాట్‌ను కూడా మార్చి కొత్త పరికరాలతో పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. - కేవలం వీవీ ప్యాట్ మాత్రమే మొరాయిస్తే దాన్ని మాత్రమే మార్పు చేయాలి. - అనుకున్న సమయంలో పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవడానికి కేంద్రం ప్రధాన ద్వారాన్ని మూసేసి అప్పటి వరకు వరుస క్రమంలో ఉన్న వ్యక్తులందరికి చివరి నుంచి నంబర్లు వేసిన కూపన్లు అందజేసి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలి. - చివరి ఓటరు ఓటు వేసిన తరువాత పోలింగ్ ప్రక్రియ ముగిసిందని ప్రకాటించాల్సి ఉంటుంది. -పోలింగ్ కేంద్రంలోకి ఓటరు ప్రవేశించగానే మొదటి పోలింగ్ అధికారి అతని పేరు, ఓటరు గుర్తింపు కార్డును పరిశీలించి సరైన వ్యకి అని తెలుసుకున్న తర్వాతే అతన్ని రెండో పోలింగ్ అధికారి దగ్గరకు పంపించాలి. - పోలింగ్ ముగిసిన తరువాత సీలింగ్ పూర్తి చేసి వారికి కేటాయించిన బస్సులో వెళ్లి సంబంధిత అధికారులకు ఈవీఎంలతో సహా అప్పగించి విధుల నుంచి విధుల నుంచి విడుదల కావాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: మీ ఓటు ఏ బూత్ లో ఉంది? పోలింగ్ స్టేషన్ ఎక్కడ?.. ఒక్క క్లిక్ తో తెలుసుకోండిలా! #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి