KCR: రయ్..రయ్.. ఒక్క రోజే కేసీఆర్ రెండు చోట్ల నామినేషన్లు! By Trinath 09 Nov 2023 in Latest News In Telugu మెదక్ New Update షేర్ చేయండి TELANGANA ELECTIONS 2023: కేసీఆర్(KCR) ఏం చేసినా కాస్త డిఫరెంట్‌గా చేస్తారు. మునపెన్నడూ లేని విధంగా ఈ సారి రెండు నియోజకవర్గాల్లో పోటి చేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. వరుస బహిరంగ సభలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అందులోనూ ఈసారి టఫ్ ఫైట్ ఉంటుందని సర్వేలు చెబుతుండడంతో కేసీఆర్ ఎక్కడ ఛాన్స్ తీసుకోవడం లేదు. ఇక నవంబర్ 3న మొదలైన నామినేషన్ల ప్రక్రియ రేపటి(నవంబర్ 10)న ముగియనున్నాయి. దీంతో ఇవాళే(నవంబర్ 9) కేసీఆర్ తాను పోటి చేయనున్న రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయనున్నారు. హెలికాఫ్టర్‌లో అటూ..ఇటు: నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్నాయి. సీఎం కేసీఆర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈసారి ఆయన గజ్వేల్, కామారెడ్డి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఉదయం 10:45కు ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి గజ్వేల్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరతారు. 10:55కు గజ్వేల్ టౌన్‌లో ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత 11 -12 గంటల మధ్య గజ్వేల్‌లో నామినేషన్ వేస్తారు. తర్వాత తిరిగి ఫాంహౌజ్ చేరుకుని లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 1:40కి కామారెడ్డికి బయలుదేరతారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ సమర్పించనున్నారు. నామినేషన్ ఆ వెంటనే ప్రసంగం: రెండు చోట్ల నామినేషన్ వేసిన తర్వాత కేసీఆర్ సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల తర్వాత కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గత శనివారం కేసీఆర్ తన ఇష్టదైవం కొన్యాపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేశారు. ఆలయ అర్చకులకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. అర్చకులు ఈ పత్రాలను మూలవిరాట్టులో ఉంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గోత్రం, నామం, తీర్మానంతో పూజలు నిర్వహించారు. ఇప్పుడు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ఈ నామినేషన్లను సమర్పించనున్నారు. Also Read: నేనూ సీఎం అభ్యర్థినే.. మనసులోని మాట చెప్పేసిన మధుయాష్కి.. WATCH: #cm-kcr #telangana-elections-2023 #gajwel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి