BJP: బీజేపీకి బిగ్‌ బూస్ట్.. ఈటల, కిషన్‌రెడ్డి అధ్వర్యంలో భారీ చేరికలు..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో చేరికలు ఊపందుకుంటున్నాయి. సంగారెడ్డి(Sangareddy) జిల్లా నుంచి పలువురు నేతలు బీజేపీ(BJP)లో చేరారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్‌రెడ్డి.. తెలంగాణలో కేసీఆర్‌ నియంతృత్వ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు..

New Update
BJP:  బీజేపీకి బిగ్‌ బూస్ట్.. ఈటల, కిషన్‌రెడ్డి అధ్వర్యంలో భారీ  చేరికలు..!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పార్టీల్లో చేరికలు, మార్పులు, వలసలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్‌(Congress)లో కొత్తగా చేరే వారి సంఖ్య ఇటివలి కాలంలో కాస్త ఎక్కువగా ఉండగా.. అటు బీజేపీలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఇదే సమయంలో బీజేపీలో కొత్త చేరికలు రావడం ఆ పార్టీకి కొత్త బూస్టింగ్‌ ఇచ్చినట్టైంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. సంగారెడ్డి(Sangareddy) జిల్లా నుంచి పలువురు నేతలు బీజేపీ(BJP)లో చేరారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితమే షెడ్యూల్‌ని ప్రకటించింది.

కిషన్ రెడ్డి ఏం అన్నారంటే?
➼ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను స్వాగతిస్తున్నాo..

➼ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్దంగా ఉన్నాం

➼ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

➼ మా శక్తినంతా పోసి ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడుతాం

➼ అధికారంలోకి వస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్నాం

➼ తెలంగాణలో కేసీఆర్‌ నియంతృత్వ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

➼ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు

➼ ఈ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తాం..

➼ ఈ ఎన్నికల్లో రెండో స్థానం, మూడో స్థానం కోసం బీఅర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడాలి..

➼ తెలంగాణ ప్రజలు బీఅర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలను చూశారు.

➼ బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు అనుకుంటున్నారు..

➼ ఉద్యమ ద్రోహులందరు ప్రగతి భవన్‌లో, ఫామ్ హౌస్ లో చేరిపోయారు..

➼ ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు..

➼ బీఅర్ఎస్ పార్టీ ఎన్నికల్లో డబ్బు వెదజల్లే అవకాశం ఉంది, అది మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చూశాం..

➼ సమ్మెలు లేని తెలంగాణ కావాలి.. అందుకే బీజేపీకి అవకాశం ఇవ్వండి..

➼ ఇటీవలే అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం, ఎన్నికలకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాం..

బహిరంగ సభ గురించి?
ఎన్నికలకు ముందు మొట్టమొదటి బహిరంగ సభ ఆదిలాబాద్‌లో జరుగుతోందన్నారు కిషన్‌రెడ్డి. ముఖ్య అతిథిగా అమిత్ షా రాబోతున్నారన్నారు. సభ తర్వాత హైదరాబాద్‌లో వివిధ రంగాల మేధావులతో అమిత్ షా భేటీ అవుతారని చెప్పారు కిషన్‌రెడ్డి. ఎల్లుండి(అక్టోబర్‌ 11) సమ్మక్క సారక్క ఆశీస్సులు తీసుకోవడానికి ములుగు వెళ్తున్నామని తెలిపారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Telangana Elections Schedule) విడుదలైంది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, ముగింపు, పోలింగ్, కౌంటింగ్ తేదీలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో ఆ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) జరగనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. రాజస్థాన్ లో 23న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది.

ALSO READ: డిసెంబర్ లో అద్భుతం.. ఆ రోజున రాష్ట్రానికి విముక్తి: రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
తాజా కథనాలు