Barrelakka: చెల్లె.. నీకు నేనున్నా: మద్దతు తెలిపిన సర్పంచ్ నవ్య బర్రెలక్కకు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సర్పంచ్ నవ్య మద్దతు ప్రకటించారు. కొల్లాపూర్ వెళ్లి బర్రెలక్కను నవ్య కలిశారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. By Nikhil 23 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క (Barrelakka) ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ ఆమెకు పెరుగుతున్న క్రేజ్ చూసి పలువురు మద్దతు తెలుపుతున్నారు. బర్రెలక్క ధైర్యంగా దూసుకుపోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సర్పంచ్ నవ్య (Sarpanch Navya) బర్రెలక్కకు మద్దతుగా నిలిచింది. కొల్లాపూర్‌కు వెళ్లి బర్రెలక్కను కలిసింది. ఇది కూడా చదవండి: TS Elections 2023: కేసీఆర్ కు డబ్బే ముఖ్యం.. బీఆర్ఎస్ కు అధికారమే బీజేపీ లక్ష్యం: విజయశాంతి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆమెను అభినందిస్తున్నానని, గర్వపడుతున్నానని తెలిపారు. మహిళలు కూడా ముందుకొచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరముందని అన్నారు. బర్రెలక్కకు ప్రజల మద్దతు ఉందని, ఎన్నికలు ముగిసేంత వరకూ ఆమె తన నిజాయితీని కాపాడుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. బహునులు కూడా ధైర్యంతో ముందుకు రావాలని, రాజ్యాధికారమే లక్ష్యంగా పయనించాలని తెలిపారు. దొరలు, పెత్తందారులు, పటేళ్ల పెత్తనం పోవాలని.. వారికి బానిసలుగా పనిచేస్తున్న కొందరు బహుజనులు ఆలోచించి తమ బిడ్డలకు మద్దతివ్వాలని కోరారు. 5 శాతం ఉన్న అగ్రకులాల వారు 95 శాతం మంది బహుజనులపై పెత్తనం చేయడం దారుణమన్నారు. ఇకనైనా రాజ్యాధికారం వస్తున్న బహుజన బిడ్డలకు అందరూ మద్దతివ్వాలని కోరారు. #telangana-elections-2023 #barrelakka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి