CM KCR: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన!

జగిత్యాల బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గం ప్రజలు కూడా బాగుపడలేదని అన్నారు. BRS అధికారంలోకి రాగానే పెన్షన్ ను రూ.5వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

New Update
TS News: హైదరాబాద్‎లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ? ఈ సారి గులాబీ బాస్ అజెండా ఇదే...!!

Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం కేసీఆర్ (CM KCR). బీఆర్ఎస్ పార్టీని (BRS Party) మరోసారి తెలంగాణలో అధికారంలోకి తెచ్చి.. మూడో సారి కూడా సీఎం అయ్యి హ్యాట్రిక్ కొట్టేందుకు కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టారు. ఎల్లుండితో ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రజల్లో జోష్ పెంచేందుకు ప్రతిపక్షాలపై మాటలను తూటాల్లా పేలుస్తున్నారు.

ALSO READ: తస్మాత్ జాగ్రత్త!.. పేర్ని నానికి కొల్లు రవీంద్ర హెచ్చరిక!

ఈరోజు జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ ముందే ఉంది.. ఆలోచించి ఓటు వెయ్యాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవని అన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని ఫైర్ అయ్యారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గం ప్రజలు కూడా బాగుపడలేదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా అత్యసవర పరిస్థితి విధించి ప్రజలను ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా 400 మందిని కాల్చి చంపిందని మండిపడ్డారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచాం అని కేసీఆర్‌ అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్‌ రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణలో రైతు రాజ్యం ఉందని అన్నారు. మూడేళ్లు కష్టపడి ధరణి పోర్టల్‌ తీసుకొచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ వస్తే రైతుబంధు కౌలుదారులకే ఇస్తామని కాంగ్రెస్‌ అంటోందని తెలిపారు. కౌలుదారు రెండు, మూడేళ్లు సాగు చేస్తే రైతు భూమి గోల్‌మాల్ అవుతుందని కేసీఆర్‌ అన్నారు.

ALSO READ: కాంగ్రెస్ కావాలా? .. కరెంట్ కావాలా?.. కవిత కీలక వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు