తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి పవర్ స్టార్.. కేసీఆర్, కాంగ్రెస్ పై పంచులు పేలుస్తారా? తెలంగాణ ఎన్నికల ప్రచారంలోని పవన్ కల్యాణ్ ఎంటర్ కానున్నారు. ఈ నెల 25 నుంచి 3 మూడు రోజులు పలు నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు. పవన్ తన ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పై ఎలాంటి పంచ్ లు పేలుస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. By Nikhil 21 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి హోరాహోరీగా సాగుతోన్న తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎంటర్ కానున్నారు. మూడు రోజుల్లో 3 సభలు, ఒక రోడ్ షో లో పవర్ స్టార్ పాల్గొననున్నారు. ఈ నెల 23న బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ తో (Eatal Rajendar) కలిసి వరంగల్, కొత్తగూడెం నియోజక వర్గాల సభల్లో ఆయన పాల్గొంటారు. 25న తాండూర్ లో ప్రచారం చేస్తారు. అనంతరం ఈ నెల 26న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో (Amith Shah) కలిసి కూకట్ పల్లిలో రోడ్ షోలో పాల్గొంటారు పవన్. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తుల్లో భాగంగా జనసేనకు 8 సీట్లను కేటాయించింది బీజేపీ. ఇది కూడా చదవండి: TS Elections: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత! దీంతో తెలంగాణ ఎన్నికల్లో జనసేనాని ప్రచారం ప్రత్యేకంగా నిలుస్తుందని అంతా భావించారు. మోదీ మీటింగ్ లో ఒక సారి మినహా.. పవన్ కల్యాణ్ మాత్రం ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన అభిమానులతో పాటు బీజేపీ శ్రేణులు సైతం అసంతృప్తిగా ఉన్నాయి. ఇది కూడా చదవండి: Revanth Reddy-EC: రేవంత్ రెడ్డి భాష బాగలేదు.. ఈసీకి బీఆర్ఎస్ కంప్లైంట్! ఎట్టకేలకు ప్రచారంలోకి పవర్ స్టార్ అడుగుపెడుతుండడంతో ఇరు పార్టీల్లో జోష్ కనిపిస్తోంది. పవర్ ప్రచారం తమకు కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. అయితే.. మోదీ మీటింగ్ కు హాజరైన పవన్ కల్యాణ్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రస్తావన లేకుండానే తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో ఈ మూడు రోజుల పర్యటనలో పవన్ ఏం మాట్లాడుతారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. #telangana-elections-2023 #jana-sena-chief-pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి