TS Elections: తెలంగాణ ఎన్నికలు.. రేపు ఇవి కూడా బంద్

రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో పార్కులు బంద్ కానున్నాయి. జంట నగరాలలోని అన్ని పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. రేపు పోలింగ్ సందర్భంగా క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

New Update
TS Elections: తెలంగాణ ఎన్నికలు.. రేపు ఇవి కూడా బంద్

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల పర్వం తుది ఘట్టానికి చేరుకుంది. రేపు ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

తాజాగా రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో పార్కులు (Park) బంద్ కానున్నాయి. జంట నగరాలలోని అన్ని పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. రేపు పోలింగ్ సందర్భంగా క్లోజ్ చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు వెల్లడించారు.

ALSO READ: BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ!

ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు రేపు(నవంబర్‌ 30) హాలీడే ఇవ్వాలని ఏపీ సీఈవో చెప్పారు. ఓటర్‌ కార్డు చూపించి ఫ్రీ లీవ్‌ తీసుకోవచ్చని సమాచారం. వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సెలవుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సెలవు దరఖాస్తుకి ఓటరు కార్డు జత చేయాలని సూచించారు. ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే ఓట్లు వేసేందుకు ఓటర్లు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. బస్సుల్లో, ట్రైన్స్‌లో ప్రయాణిస్తున్నారు. ఓటు అందరూ వేయాలి.. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రతీ పౌరిడి హక్కు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఇప్పటికే అధికారులు, ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

ALSO READ: తెలంగాణ ఎన్నికలకు వరుణ గండం!

Advertisment
Advertisment
తాజా కథనాలు