TS ELECTIONS 2023: తెలంగాణలో ఎన్నికలు.. ఏపీ ఉద్యోగులకు సెలవు! ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు నవంబర్ 30న సెలవు ఇవ్వాలని ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశించారు. తెలంగాణలో రేపు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇటు తెలంగాణలోని ప్రైవేట్ కంపెనీలు పోలింగ్ రోజున సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ 'CEO చెప్పారు. By Trinath 29 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి తెలంగాణ ఎన్నికల(Telangana elections) ఫీవర్ ఏపీలోనూ కనిపిస్తోంది. మునపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాజకీయాలపై ఏపీ ప్రజలు సైతం తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈసారి తెలంగాణలో ఎవరు గెలుస్తారని కాల్స్‌లో తెలంగాణ ఫ్రెండ్స్‌ని అడిగి ఏపీ ప్రజలు తెలుసుకుంటున్నారంటే ఎన్నికల ఫీవర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని ఫిక్స్ ఐపోయిన అక్కడి ప్రజలు పెద్దగా ఆసక్తిగా చూపించలేదు. ఈసారి నువ్వా నేనా అన్నట్లు ఎన్నికలు జరుగుతాయని సర్వేలు చూస్తే అర్థమవుతుండడంతో అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక అదే సమయంలో ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు తమ ఓట్లు వేసేందుకు ఇప్పటికే లగేజీ సర్థుకున్నారు. అలాంటివారికి ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(CEO) గుడ్‌న్యూస్ చెప్పారు. జీవో హాలీడే తీసుకోండి: ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు రేపు(నవంబర్ 30) హాలీడే ఇవ్వాలని ఏపీ సీఈవో చెప్పారు. ఓటర్ కార్డు చూపించి ఫ్రీ లీవ్ తీసుకోవచ్చని సమాచారం. వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సెలవుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సెలవు దరఖాస్తుకి ఓటరు కార్డు జత చేయాలని సూచించారు. ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే ఓట్లు వేసేందుకు ఓటర్లు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. బస్సుల్లో, ట్రైన్స్‌లో ప్రయాణిస్తున్నారు. ఓటు అందరూ వేయాలి.. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రతీ పౌరిడి హక్కు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఇప్పటికే అధికారులు, ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సెలవు ఇవ్వకపోతే చర్యలు: తెలంగాణలో పోలింగ్ తేదీ(నవంబర్ 30)న సెలవు ప్రకటించని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ రాష్ట్ర లేబర్ కమిషనర్‌ను ఆదేశించారు. కార్మిక శాఖకు రాసిన లేఖలో, పోలింగ్ రోజున అన్ని సంస్థలు, కార్యాలయాలు, కంపెనీలకు సెలవు మంజూరు చేశారో లేదో ధృవీకరించాలని సీఈవో లేబర్ కమిషనర్‌ను కోరారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించడం లేదంటూ పలు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని ఆయన హైలైట్ చేశారు. Also Read: హమ్మయ్య క్లారిటీ వచ్చేసింది..టీమ్ ఇండియా కోచ్‌గా ద్రావిడ్ కొనసాగింపు WATCH: #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి