Minister KTR: 'హ్యాట్రిక్ లోడింగ్'.. కౌంటింగ్‌కు ముందు కేటీఆర్ ఇంట్రస్టింగ్ ట్వీట్.. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 'హ్యాట్రిక్ లోడింగ్.. గెట్ రెడీ టూ సెలబ్రేట్ గాయ్స్' అంటూ తాను తుపాకీ ఎక్కుపెట్టిన ఫోటోను ట్వీట్ చేశారు కేటీఆర్. By Shiva.K 02 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Minister KTR Tweet: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసిన ఆయన.. బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఇంతకీ కేటీఆర్ ఏం పోస్ట్ చేశారనేగా వేయిటింగ్. తెలంగాణలో మూడవ సారి విజయం సాధించడం ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. ఆ విశ్వాసంతోనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. తాను తుపాకీ ఎక్కి పెట్టి ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన కేటీఆర్.. 'హ్యాట్రిక్ లోడింగ్.. గెట్ రెడీ టూ సెలబ్రేట్ గాయ్స్' అంటూ క్యాప్షన్ పెట్టారు. Hattrick Loading 3.0 👍 Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w — KTR (@KTRBRS) December 2, 2023 కేటీఆర్ పోస్ట్‌తో బీఆర్ఎస్ శ్రేణులు సరికొత్త జోష్‌తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఆయన ట్వీట్‌ను రీట్వీట్, పోస్టులను రీపోస్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ విజయం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేటీఆర్ పోస్టులకు కామెంట్స్ పెడుతున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు. Also Read: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుపాను ఎఫెక్ట్.. 142 ట్రైన్స్ రద్దు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, 144 సెక్షన్.. #telangana-elections #telangana-election-counting #telangana-politics #telangana-news #telangana-elections-2023 #telangana-elections-updates #minister-ktr-tweet సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి