TS Politics: కేటీఆర్‌కు ఓటమి భయం.. ఫోన్ కాల్ ఆడియోను షేర్ చేసిన కాంగ్రెస్! ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అలర్ట్ గా ఉండాలంటూ కేడర్ తో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆడియోను లీక్ చేసిన కాంగ్రెస్.. ఆయనకు ఓటమి భయం పట్టుకుందంటూ కామెంట్ చేస్తోంది. By Nikhil 22 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ఎన్నికలు (Telangana Elections 2023) సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ, ప్రతిపక్షాలు పరస్పర విమర్శలకు పదును పెంచుతున్నాయి. తాజాగా కాంగ్రెస్..కేటీఆర్ (KTR) ఫోన్ కాల్ ఆడియోను నెట్టింట పంచుకుంది. కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే కేడర్ ప్రచారానికి పోవాలంటే వెనకాడుతోందని కామెంట్ చేసింది. నాయకులకు ఫోన్లు చేసి బ్రతిమలాడుకునే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందని ఎద్దేవా చేసింది. సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని కామెంట్ చేసింది. కేటీఆర్ ఫోన్ కాల్‌గా కాంగ్రెస్ చెబుతున్న ఆడియోలో మంత్రి..సిరిసిల్ల స్థానిక నాయకులను ఎన్నికల ప్రచారం గురించి అప్రమత్తం చేశారు. రాష్ట్రం మొత్తం సిరిసిల్ల వైపు చూస్తోందని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: Gadari Kishore: కోమటిరెడ్డి బ్రదర్స్ కు మెంటల్.. అలా చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా: గాదరి కిషోర్ ఈ వారం రోజులు ఏ ఊరి వాళ్లు ఆ ఊరిలో.. ఏ బూత్ వాళ్లు ఆ పరిధిలో పటిష్ఠంగా ఇంటింటా ప్రచారం చేయాలని మంత్రి చెప్పినట్టు ఆడియోలో వినిపించింది. రాబోయే వారం రోజులు సిరిసిల్లలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ సూచిస్తున్నట్టు ఆడియోలో ఉంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీలు, అందరూ కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు పదిమంది పది రకాలుగా మాట్లాడటం బంద్ చేయాలని హెచ్చరించారు. మెజార్టీ తగ్గుతుందని మనోళ్లే ప్రచారం చేస్తున్నారని, మనల్ని మనమే తగ్గించుకోవద్దని అక్కడి నాయకులకు కేటీఆర్ క్లాస్ తీసుకున్నట్టు ఉన్న వీడియోను కాంగ్రెస్ షేర్ చేసింది. #ktr #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి