Patel Ramesh Reddy: పోటీ నుంచి తగ్గేదేలే.. పటేల్ రమేష్ రెడ్డి నినాదం ఇదే?

పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా కాంగ్రెస్ పెద్దలు చేసిన చర్చలు ఫలించలేదన్న చర్చ సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. స్థానికుడినైన తనకు అవకాశం ఇవ్వాలన్న నినాదంతో ఎన్నికల బరిలో ఉండాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

New Update
Patel Ramesh Reddy: పోటీ నుంచి తగ్గేదేలే.. పటేల్ రమేష్ రెడ్డి నినాదం ఇదే?

సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున బరిలోకి దిగారు పటేల్ రమేష్ రెడ్డి (Patel Ramesh Reddy). గత ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ రాలేదు. దీంతో ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డికి మద్దతు ప్రకటించి ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో దామోదర్ రెడ్డి విజయం సాధించలేదు. అయితే.. ఈ సారి కూడా టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నమ్ముకున్న రేవంత్ రెడ్డి కూడా తనకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (AIFB) తరఫున సింహం గుర్తుపై పోటీకి దిగారు రమేష్ రెడ్డి. అయితే.. పటేల్ రమేష్‌ రెడ్డి నామినేషన్ ను విత్ డ్రా చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: CM KCR: మాట తప్పిన జానారెడ్డిని ప్రజలే ఓడించిండ్రు: హాలియా సభలో కేసీఆర్ సెటైర్లు

అయితే.. రమేష్ రెడ్డి మాత్రం బరిలో నుంచి తప్పుకునే సమస్యే లేదని వారికి స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. నమ్ముకుని కాంగ్రెస్ లో చేరితే గత ఎన్నికల సమయంలోనూ ఇలానే చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పోటీలో ఉండడం కన్ఫామ్ అన్న ప్రచారం సూర్యాపేటలో సాగుతోంది. రమేష్ రెడ్డి బరిలో ఉంటే కాంగ్రెస్‌ అభ్యర్థికి ఇబ్బందులు తప్పవన్న చర్చ హస్తం పార్టీలో సాగుతోంది.

మరో వైపు రమేష్ రెడ్డి మిగతా అభ్యర్థుల కన్నా ముందుగానే ఇంటింటి ప్రచారం కూడా ప్రారంభించారు. స్థానికుడైన తనను సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకునే అవకాశమే లేదని స్పష్టం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రమేష్ రెడ్డి టికెట్ కోసం ఆఖరి నిమిషం వరకు పోరాటం చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు విత్ డ్రా చేయించే బాధ్యత కూడా తీసుకోవాలని దామోదర్ రెడ్డి అంటున్నట్లు సమాచారం.

రేపు రేవంత్ రెడ్డి రమేష్‌ రెడ్డితో మాట్లాడి భవిష్యత్ లో మంచి స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒక వేళ రమేష్ రెడ్డి అంగీకరించకపోతే పరిస్థితి ఏంటన్న అంశంపై దామోదర్ రెడ్డి వర్గంలో చర్చ జరుగుతోంది.

ప్రధాన పార్టీల అభ్యర్థులైన జగదీష్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వర రావు, దామోదర్ రెడ్డి ముగ్గురూ తుంగతుర్తి నుంచి వచ్చిన వారేనని.. స్థానికుడైన తనకు ఒక్క సారి అవకాశం ఇవ్వాలన్న నినాదంతో పటేల్ రమేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు