మంత్రి కేటీఆర్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఈ రోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ దీక్షా దివాస్ నిర్వహించిందని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

New Update
మంత్రి కేటీఆర్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

మంత్రి కేటీఆర్ పై (Minister KTR) కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కు (EC) ఫిర్యాదు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ భవన్ లో ఈ రోజు దీక్షా దివాస్ నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు వినతి పత్రం అందించారు కాంగ్రెస్ నేతలు. ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ చేపట్టిన దీక్షా దివాస్ ను ఎన్నికల ఫ్లాయింగ్ స్క్వాడ్ అధికారులు అడ్డుకున్నారు. అయితే.. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ కార్యక్రమానికి ఎన్నికలతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: కొత్తగూడెం: జలగం క్యాంప్ కార్యాలయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు

భారీగా పోలీసులు మోహరించడం, మరో వైపు భారీగా బీఆర్ఎస్ నేతలు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ నేతలు అధికారులతో మాట్లాడారు. చివరికి తెలంగాణ భవన్ లో కార్యకర్తలతో కలిసి రక్తదానం నిర్వహించారు కేటీఆర్.
ఇది కూడా చదవండి: TS Elections 2023: 3.26 కోట్ల ఓటర్లు.. 2,290 అభ్యర్థులు.. 35,655 పోలింగ్ కేంద్రాలు: తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం ఇదే!

అయితే.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉన్న ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలు దీక్షా నివాస్ నిర్వహించడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇది ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘనే అవుతుందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల అధికారులు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు