TS Elections Voting: మీరు తప్పకుండా ఓటేయాల్సిందే.. ఎందుకంటే? ఓటు అందరి హక్కు.. నవంబర్ 30న అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. మన భవిష్యత్ మన ఓటుపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటర్లే పాలకులు. ఓటు విలువ తెలుసుకోని అంతా ఓటు వెయ్యాలని కేంద్రం ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. By Trinath 29 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ప్రజాస్వామ్యం(Democracy)లో ఓటు(Vote)కు మించిన ఆయుధం లేదు. మన తలరాత మన ఓటులోనే ఉంటుంది. ఏదైనా డ్రెస్ కొనాలనుకుంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించి కొంటాం. అది మంచిదో కాదో అని పదిసార్లు లెక్కలేసుకుంటాం. మరి మనల్ని పాలించేవారి కోసం పది నిమిషాలు కేటాయించలేమా? ఓటు ఒక్క నిమిషం పని.. ఫ్రెండ్స్‌తోనో, కుటుంబసభ్యులతోనూ హ్యాపీగా వెళ్లి ఓటు వేసి ఇంటికి వెళ్లిపోవచ్చు. ఓటు అందరి బాధ్యత.. మనందరి హక్కు.. ఓటుతోనే భవిష్యత్..! ఓటు హక్కు కోసం ఉద్యమాలు జరిగాయని తెలుసా? నియంత పాలనలను తరిమికొట్టి ప్రజాస్వామ్యపాలనలోకి ప్రపంచం వెళ్లడానికి వేలాది సంవత్సరాలు పట్టింది. ఈ విషయం తెలుసుకుంటే ఓటు విలువ తెలుస్తుంది. Telangana ! Tomorrow It's the Poll Day. Step out and cast your valuable vote. "वोट करो ध्यान से, सबको बताओ शान से।"#ECI #Sveep #AssemblyElections2023 #TelanganaElections2023 #GoVote #IVote4Sure pic.twitter.com/xoxv5HkYzS — Election Commission of India (@ECISVEEP) November 29, 2023 గతంలో చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్: ఓటింగ్ రోజు ఎందుకు సెలవు ఇస్తారో తెలుసా? ఓటు వెయ్యమని.. అంతేకానీ సెలవు తీసుకోని టూర్లు వెళ్లమని కాదు.. గత ఎన్నికల్లో హైదరాబాద్ రీజియన్‌లో చాలా తక్కువ ఓటింగ్ నమోదైంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 76.5శాతం పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కేవలం 50శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఓటు కోసం ఇచ్చిన హాలీడేని జాలీగా గడిపేశారు కొందరు. ఈ సారి అలా చేయవద్దు. ప్రతీ ఓటూ ముఖ్యమే: ఒక ఓటు లక్షాలాది జీవితాలను ప్రభావితం చేస్తుందని తెలుసా? మీరు వేసే ఓటు కోట్ల మంది ప్రజల్లో వెలుగును తీసుకొస్తుందని తెలుసా? రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును మనం వినియోగించుకోకపోతే ప్రశ్నించే అర్హతను కోల్పోతాం. 'నువ్వు ఓటు వెయ్యలేదుగా.. ఎందుకు మాట్లాడుతున్నావ్.. నీకేం పని..' లాంటి నిలదీతను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఒక్క ఓటుతో ఫలితాలు తారుమరవుతాయి. 'నా ఓటుతో ఏం మారదులే' అనుకుంటే మీరు చాలా తప్పు చేస్తున్నట్లు లెక్క. Telangana, It's a poll day Tomorrow ! ECI appeals to every voter of Telangana to cast their vote tomorrow on 30th November #ECI #CEOTelangana #TelanganaElections2023 #GoVote #IVote4Sure@ECISVEEP @SpokespersonECI @PIB_India @airnewsalerts @DDNational @taskts pic.twitter.com/2A474rbL5O — CEO Telangana (@CEO_Telangana) November 29, 2023 ఎప్పుడైనా ఇలా అనిపించిందా? రోడ్డుపై వెళ్తుంటాం.. ఏ గుంతలోనో పడిపోయాం.. లేకపోతే భారీ వర్షం పడింది.. మీ ఇంట్లోకి వరద నీరు వచ్చేసింది. ఈ సమస్యలను స్థానిక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. మరి ఏం చేయాలి? ఓటుతో బుద్ధి చెప్పాలి. సమస్యలు తీర్చాలన్నా, సమస్యలు పరిష్కరించని వారిని తరిమి కొట్టాలన్నా ఓటే ఆయుధం. #తెలంగాణఎన్నికలు2023 రేపు మర్చిపోవద్దు; మీరు మీ ఓటు వేయాలి. పోలింగ్ తేదీ : 30th Nov 2023@ECISVEEP @CEO_Telangana pic.twitter.com/JfOf6VjWJg — District Election Officer Hyderabad (@DEO_HYD) November 28, 2023 మీ జీవితం మీ చేతిలోనే: మీ లైఫ్ చాలా బాగుందా? మీ ఊరి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? మరి ఓటు ఈసారి ఓటు వెయ్యకపోతే ఆ ఎమ్మెల్యేను అవమానించినట్లు కాదా? మీరు ఓట్లు వెయ్యక మీ ఎమ్మెల్యే ఓడిపోయి.. ఏ అవినీతిపరుడైన ప్రజాప్రతినిధో మీ నెత్తినెక్కి కూర్చుంటే ఇది మీ జీవితంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే ఓటు వెయ్యాల్సిందే.. ఓటర్లే పాలకులు..ఓటర్లే దేవుళ్లు.. అందరూ తప్పకు ఓటు హక్కును వినియోగించుకోండి! Also Read: మీ బదులు ఎవరైనా దొంగ ఓటు వేస్తే.. టెన్షన్ పడకుండా ఇలా చేయండి! WATCH: #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి