BREAKING: నన్ను చంపేస్తారు.. బర్రెలక్క సంచలన ప్రెస్ మీట్!

కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలో ప్రచారం చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్కపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను చంపేస్తారేమోనని కన్నీళ్లు పెట్టుకున్నారు.

New Update
BREAKING: నన్ను చంపేస్తారు.. బర్రెలక్క సంచలన ప్రెస్ మీట్!

Telangana Elections 2023: కొల్లాపూర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో దిగుతున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ బర్రెలక్క (Barrelakka) (శిరీష)పై దాడి జరిగింది.పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బర్రెలక్క అలియాస్ శిరిష్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఏ పార్టీ వారు దాడి చేశారో తెలియదని అన్నారు. తాను ఎన్నికల బరిలో ఉంటే ఓట్లు చీలుతాయనే భయంతో దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. తమకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు. ఇప్పటికైనా ఓటర్లు మారాలని కోరారు.
ఇది కూడా చదవండి: Telangana Elections 20203: కాంగ్రెస్ నేతలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన కేటీఆర్‌.

మంచి నాయకులను గెలిపించాలని కోరారు. మీరు మంచోడని మీరు గెలిపించిన వారే తనపై దాడి చేశారన్నారు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయకూడదని రాజ్యంగంలో ఉందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి పూట ఫోన్లు చేసి భయపెట్టిస్తున్నారన్నారు. తనను బెదిరిస్తున్న వారు ఏ పార్టీ అని చెప్పట్లేదన్నారు. తన తమ్ముడిని కొట్టారన్నారు. తనకు సెక్యూరిటీని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇలా దాడులు చేస్తూ తన లాంటి వారిని తొక్కిపడేస్తున్నారన్నారు. నిరుద్యోగుల కోసం తాను మాట్లాడడమే వారికి ఇబ్బంది కలిగిస్తోందన్నారు. తనకు ఏమైనా అయితే తన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు బర్రెలక్క.

తెలంగాణ నిరుద్యోగుల తరఫున ఈ ఎన్నికల్లో బరిలో నిలిచారు బర్రెలక్క. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే, నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవాలంటూ కొందరు వ్యక్తులు బర్రెలక్కను బెదిరించారు... మరికొందరు డబ్బు ఆశ చూపించారు. ఎవరెన్ని చేసిన బర్రెలక్క మాత్రం పోటీలో నుంచి వెనక్కి తగ్గలేదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిరుద్యోగులు ఆమెకు మద్దతుగా నిలిస్తున్నారు. బర్రెలక్క తరఫున కొల్లాపూర్ నియోజకవర్గానికి చేరుకొని వారు ప్రచారం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు