BJP Resolutions: పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్శిటీ.. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ ఏడు తీర్మానాలు ఇవే!

మహిళా రిజర్వేషన్లు, పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్శిటీ, జీ-20 సమ్మిట్ సఫలం, చంద్రయాన్-3 విజయం, కృష్ణ బోర్డ్ ట్రిబ్యునల్, రాజకీయ తీర్మానం.. ఈ ఏడు తీర్మానాలను బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆమోదించారు. మహిళా రిజర్వేషన్ పై ధన్యవాద తీర్మానాన్ని డికె అరుణ పెట్టగా.. టర్మరిక్ బోర్డ్ ఏర్పాటుపై అరవింద్, రాజకీయ తీర్మానాని బండి సంజయ్, ట్రైబల్ యూనివర్శిటీ మంజూరుపై ధన్యవాద తీర్మానాన్ని సొయం బాపూరావు ప్రవేశపెట్టారు.

New Update
BJP Resolutions: పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్శిటీ.. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ ఏడు తీర్మానాలు ఇవే!

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో 7 తీర్మానాలను ఆమోదించారు. రాజకీయ తీర్మానంలో కుటుంబ పాలన ప్రజస్వామ్యానికి ప్రమాదకరమని బీజేపీ(BJP) పేర్కొంది. మీడియాలో ప్రభుత్వ సొమ్ముతో రెచ్చగొట్టే ప్రకటనలు చేయడాన్ని ఖండిస్తూ రాజకీయ తీర్మానం చేసింది బీజేపీ. కేసీఆర్ పాలన అవినీతిమయమని.. ఇచ్చిన హామీలు అమలులో వైఫల్యం చెందారని ఆరోపిస్తూ బీజేపీ తీర్మానించింది. కొలువులు ఇవ్వకుండా యువత విరోధిగా కేసీఆర్ మారారని బీజేపీ రాజకీయ తీర్మానంలో చెప్పింది. అటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా పేదలను మోసం చేస్తున్నారనీ ఆరోపిస్తూ రాజకీయ తీర్మానం చేసింది.

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ ఏడు తీర్మానాలు ఇవే:
➊ మహిళా రిజర్వేషన్లు
➋ పసుపు బోర్డ్
➌ ట్రైబల్ యూనివర్శిటీ
➍ జీ-20 సమ్మిట్ సఫలం
➎ చంద్రయాన్ 3 విజయం
➏ కృష్ణ బోర్డ్ ట్రిబ్యునల్
➐ రాజకీయ తీర్మానం

బీజేపీ తీర్మానాలు సమావేశంలో పెట్టిన వారు:

‣ మహిళా రిజర్వేషన్ పై ధన్యవాద తీర్మాన- డికె అరుణ

‣ జీ20 విజయవంతంపై - AVN రెడ్డి

‣ టర్మరిక్ బోర్డ్ ఏర్పాటుపై - అరవింద్

‣ రాజకీయ తీర్మానం- బండి సంజయ్

‣ ట్రైబల్ యూనివర్శిటీ మంజూరు పై ధన్యవాద తీర్మానం - సొయం బాపూరావు

‣ చంద్రయాన్ 3 విజయం - మురళీధర్ రావు

‣ కృష్ణ ట్రిబ్యునల్ - జితేందర్ రెడ్డి

బీజేపీ ఏడు తీర్మానాల్లో కుటుంబపాలన అంశాన్ని ప్రధానంగా హైలెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇటివలీ కాలంలో కేసీఆర్‌ కుటుంబపాలన చేస్తున్నారంటూ బీజేపీ మండిపడుతోంది. మొన్న తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ కూడా ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ కేసీఆర్‌ని టార్గెట్ చేశారు. ఇక పసుపు బోర్డు అంశాన్ని కూడా తీర్మానంలో చేర్చారు. ఇది ఎన్నికల్లో గెలుపు అస్త్రంగా పని చేస్తుందని బీజేపీ బలంగా భావిస్తోంది. ఇక మహిళా రిజర్వేషన్‌ కూడా లిస్ట్‌లో పెట్టారు. మహిళల ఓట్ల కోసం ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక అంశంతో ప్రజల ముందుకు వస్తుండగా బీజేపీ మొన్న ముగిసిన స్పెషల్‌ పార్లమెంట్ సమావేశాల్లో ఏకంగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించేసుకుంది. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ సైతం తీర్మానాల్లో మహిళా రిజర్వేషన్‌ని మెన్షన్ చేసింది.

ALSO READ: కాంగ్రెస్‌ సంచలన హామీ..పెళ్లి సమయంలో ఆడపిల్లలకు తులం బంగారం..!

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL

Advertisment
Advertisment
తాజా కథనాలు