BIG BREAKING: తెలంగాణలో 144 సెక్షన్!

ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం 4గంటల నుంచి డిసెంబర్ 1 ఉదయం 6గం వరకూ అమలులో ఉంటుందని సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ గుమిగూడటం నిషేధం అని పేర్కొన్నారు.

New Update
BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!

Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసింది. ఎల్లుండి తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఈ రోజు సాయంత్రం 4గంటల నుంచి డిసెంబర్ 1 ఉదయం 6గం వరకూ అమలులో ఉండనున్నాయి. ఐదుగురు అంతకంటే ఎక్కువ గుమిగూడటం నిషేధం. ఈరోజు నుంచి 30వ తేదీ వరకు మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి.

ALSO READ: ఓటు వెయ్యకపోతే సచ్చిపోతా.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ లో కర్రలు, జెండాలు, తుపాకులు వంటి ఆయుధాలతో సంచరించడం నిషేధం విధించారు హైదరాబాద్ సీపీ సందీప్‌ శాండిల్య. హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్‌ దూరంలో సమావేశాలు, గుంపుగా సంచరించడంపై నిషేధం ఉండనుంది. బహిరంగ ప్రదేశాల్లో టెంట్లు, షామీనాలు వేయడం నిషేదించారు.

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌.. డిసెంబర్‌ 3న తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు.. 119 నియోజకవర్గాలల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ.

Advertisment
Advertisment
తాజా కథనాలు